Kavya Maran – Krunal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. మరో 8 రోజుల్లో ఐపీఎల్ టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఇలాంటి క్రమంలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో 55 పరుగులు తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప (Kavya Maran) చాలా అసహనంతో కనిపించారు. బెంగళూరు బౌలర్ కృనాల్ పాండ్యా ( Krunal Pandya) త్రో బౌలింగ్ చేస్తున్నాడని ఆమె సీరియస్ అయ్యారు. బౌన్సర్లతో విసిగిస్తున్నాడని మండిపడింది. ఈ నేపథ్యంలోనే పక్కన ఉన్న విక్టరీ వెంకటేష్ తో ( Venkatesh) కూడా ఇదే విషయంపై ఆమె డిస్కషన్ చేశారు. ఆ తర్వాత కావ్య పాప అసహనం వ్యక్తం చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ఏకంగా 55 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా చాలా సార్లు బౌన్సర్లు వేశాడు. ఇప్పటికే అతని బౌలింగ్ యాక్షన్ పై చాలా మంది ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే తరహాలో బౌన్సర్లతో రెచ్చిపోయాడు. అయితే ఈ బౌన్సర్లు చూసిన కావ్య పాప అసహనం వ్యక్తం చేశారు. పదేపదే బౌన్సర్లు ఎందుకు వేస్తున్నాడని ఫైర్ అయింది.
వాడిది త్రో బౌలింగ్ అంటూ తన చేతులతో సైగలు చేసింది. డకౌట్ లో కూర్చున్న ఆమె… కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ గురించి విక్టరీ వెంకటేష్ ను అడిగి తెలుసుకుంది. ఇలా త్రో బౌలింగ్ చేస్తే ఎలా అని కూడా ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన హైదరాబాద్ అభిమానులు… తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. వెంటనే కృనాల్ పాండ్యా పై బీసీసీఐకి కావ్య పాప ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాడికి బుద్ధి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వెధవలను అస్సలు వదలకూడదని కోరుతున్నారు. మళ్లీ ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో హైదరాబాద్ ఆడే అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టం చేస్తున్నారు అభిమానులు. 2016 సీన్ రిపీట్ చేస్తామని కూడా అంచనా వేస్తున్నారు.
Kavya Maran doesn’t know cricket one bit.
She is crying like a little baby after KrunalPandya bowed a bouncer to Nitish Reddy.
Kavya Maran: He is chucking. What the hell? #SRHvsRCB #Kohli pic.twitter.com/ML52x74mXP— Sanatan Brigade (@SanatanSense) May 22, 2026