Michael Vaughan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తోపు ప్లేయర్లకు పోటీగా అదరగొడుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వైభవ్ సూర్య వంశీ చేతికి ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ అందరి బౌలింగ్ లో కూడా వైభవ్ సూర్యవంశీ రఫ్ఫాడిస్తున్నాడు. వరల్డ్ నెంబర్వన్ బౌలర్లపై కూడా కనికరం లేకుండా చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీపై ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు మైఖేల్ వాన్ ( Michael Vaughan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగానే ఆడుతున్నాడు.. కానీ 21 సంవత్సరాలు రాగానే అతనిలో పస పోయి… కెరీర్ నాశనం అయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇప్పుడు బాగా ఆడిన ప్లేయర్ ఎవరూ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత ఆడడం కష్టమని బాంబు పేల్చారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు మైకేల్ వాన్ హాట్ కామెంట్స్ చేశారు. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ అలుపు లేకుండా దుమ్ము లేపుతున్నాడని పొగిడారు. అయితే అతనికి 21 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా అలసిపోతాడని హెచ్చరించారు. అప్పటికి అతని దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది కావచ్చు కానీ… ఫిట్నెస్ మాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. 21 సంవత్సరాలు వచ్చేసరికి అతని మానసిక స్థితి, శారీరక అలసట ఇలా అన్ని డిస్టర్బ్ అవుతాయని బాంబు పేల్చారు మైఖేల్ వాన్.
15 ఏళ్ల వయసులో ఉన్న ఆటగాడు ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్ లో ఆడటం వల్ల తీవ్రమైన ఒత్తిడి అతనిపై పడుతుందని పేర్కొన్నారు. ఆ ఒత్తిడి మీ చిన్న పిల్లలు తట్టుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అన్ని భరించి వైభవ్ సూర్యవంశీ డబ్బుల కోసం ఆడుతున్నాడని సెటైర్లు పేల్చారు. టీనేజ్ పూర్తికాకముందు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడితే, గాయాల బారిన పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ డబ్బు పుష్కలంగా వస్తుంది.. కానీ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు మైకేల్ వాన్. ఇప్పటికైనా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ టోర్నమెంట్ కు కాస్త దూరంగా ఉండి.. రంజి ట్రోఫీల పై దృష్టి పెట్టాలని కోరారు. ఒత్తిడి ఎక్కువగా లేని టెస్టులను ఎక్కువగా ఆడితే వైభవ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. అలా కాదని డబ్బులకు ఆశపడి ఐపిఎల్ లో కొనసాగితే.. 21 సంవత్సరాలు వచ్చేసరికి వైభవ్ సూర్యవంశం సంకనాకి పోవడం గ్యారెంటీ అని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
On Vaibhav Sooryavanshi
Phil Tufnell – “He could be burn out by 21.”
Michael Vaughan – “Will have enough cash by 21.”
Alastair Cook – “He can’t be burn out, he plays 30 balls.” pic.twitter.com/fridWquiDL
— Cricketopia (@CricketopiaCom) May 6, 2026