MOHAMMAD YOUSUF ON INDIA TEAM: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా మహిళల జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టైటిల్ గెలిచిన తర్వాత… ఉత్త చేతులతోనే ఇండియాకు వచ్చేసింది టీమిండియా మహిళల జట్టు. బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే వెనుదిరిగింది. అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఇండియాదే తప్పు అని కొంతమంది అంటుంటే… మరి కొంతమంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు మొహ్సిన్ నఖ్వీ సరైన గుణపాఠం చెప్పాడంటూ ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ట్రోఫీ అందుకోవాల్సిందేనని వెల్లడించారు. అనవసరంగా ట్రోఫీ వివాదంపై రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు మహమ్మద్ యూసఫ్.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఛాంపియన్ గా నిలిచిన మహిళల టీమిండియా… ట్రోఫీ మాత్రం అందుకోలేదు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా త్రోఫి అందుకోకుండా… సూర్య కుమార్ యాదవ్ ను ఫాలో అయింది. అయితే దీనిపై మహమ్మద్ యూసఫ్ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా కు అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. గర్వం కాస్త అహంకారంగా మారి.. టీమిండియా పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ అహంకారం ఇలాగే కొనసాగితే… అతి త్వరలోనే టీమ్ ఇండియా సర్వ నాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
బిసిసిఐ దగ్గర డబ్బులు ఉన్నాయని.. విర్ర వీగుతున్నట్లు ఫైర్ అయ్యారు. ఛాంపియన్ అయిన తర్వాత.. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోకుండా… మహిళల టీమిండియా ఓవరాక్షన్ చేసిందని నిప్పులు చెరిగారు. ఇందులో ముమ్మాటికి ఇండియా తప్పు ఉందని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రోటోకాల్ ప్రకారం మొహ్సిన్ నఖ్వీ టైటిల్ ఇస్తేనే తీసుకోవాలని… ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మహమ్మద్ యూసఫ్. ఈ మాత్రం తెలియకుండా బీసీసీఐ పెద్దలు ఏం పీకుతున్నారని మండిపడ్డారు.
అంత పౌరుషం ఉంటే.. ఆసియా కప్ ( Asia cup ) ఆడకుండా దూరంగా ఉండాలని ఇండియాకు కౌంటర్ ఇచ్చారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇండియాలో పర్యటించడం ఇష్టం లేక… బంగ్లాదేశ్ సరైన నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఆ టోర్నమెంట్ను బహిష్కరిస్తూ ఇండియాకు షాక్ ఇచ్చినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ తరహా లోని టీమిండియా కూడా ఆసియా కప్ బహిష్కరిస్తే బాగుండు అంటూ కౌంటర్ ఇచ్చారు.