IND VS AFG: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో ఇప్పటికే 13వ తేదీన మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ఇవాళ జరిగిన రెండో టి20 లో కూడా విక్టరీ అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా, ఆఫ్గనిస్తాన్ జట్టును చిత్తు చేసింది. వరుసగా రెండింటిలో గెలిచిన టీమిండియా, 2-0 తేడాతో మరో టి20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో వరుసగా రెండో టి20 సిరీస్ టీమిండియా ఖాతాలో పడింది.
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఇవాళ రెండో టి20 జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఆప్ఘనిస్తాన్ జట్టు 159 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని టీమిండియా అవలీలగా చేదించింది. ఆఫ్ఘనిస్తాన్ విధించిన లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్స్ ఎదుర్కొన్న టీమిండియా… మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పై మరోసారి 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా, సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో టి20 మిగిలి ఉంది. ఈ మ్యాచ్ ఇదే వేదికగా సెప్టెంబర్ 17వ తేదీన జరగనుంది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టి20 సందర్భంగా సంజు శాంసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ హీరోగా మారిన సంజు శాంసన్ , ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. దీంతో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు అవకాశం ఇవ్వాలని.. సంజు శాంసన్ ను పక్కకు పెట్టాలని చాలామంది మాజీలు కూడా దారుణంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన మ్యాచ్లు 22 బంతుల్లో 57 పరుగులతో ట్రోలర్స్ కు సమాధానం చెప్పాడు సంజు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. 259 స్ట్రైక్ రేట్ తో ఆప్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అటు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా 39 పరుగులతో రాణించాడు.
ఆఫ్గనిస్తాన్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో సంజు శాంసన్ తన మాస్టర్ మైండ్ ను బయట పెట్టాడు. ఈ నేపథ్యంలో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ మరోసారి డక్ ఔట్ అయ్యాడు. రహ్మానుల్లాహ్ గుర్బాజ్ బ్యాటింగ్ విధానాన్ని పసి గట్టి.. షార్ట్ బాల్ వేయాలని అర్షదీప్ సింగ్ కు సూచించాడు సంజు. దానికి తగ్గట్టుగానే అర్షదీప్ కూడా షార్ట్ బంతి వదిలాడు. ఈ క్రమంలో, చెత్త షార్ట్ ఆడి, రవికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్. దీంతో సంజు చెప్పిన ప్లాన్ వర్క్ అవుట్ అయింది. ఈ క్రమంలో సంజు పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.