E-Paper
Advertisement

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !
Advertisement

IND VS AFG : టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ ప్రారంభమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రోజున తొలి మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ సేనకు మంచి శుభారంభం అందింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలో 3 టీ20 ల సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది శ్రేయస్ అయ్యర్ సేన.

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తొలి టీ20 షురూ అయింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, పడుతూ లేస్తూ 156 పరుగులు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు, 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించ గలిగారు. ఒమర్జాయ్, మహమ్మద్ నబీ పుణ్యమా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఆఫ్గనిస్తాన్. ఇక ఆఫ్గనిస్తాన్ విధించిన లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి అవలీలగా చేదించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో 13.4 ఓవర్లు ఆడిన టీమిండియా, 3 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ విధించిన లక్ష్యాన్ని చేధించింది.

Advertisement

అభిషేక్ శర్మ 82 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 42 పరుగులతో ఇరగదీశారు. ఈ క్రమంలో టీమిండియా 14 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేయగలిగింది. ఇది ఇలా ఉండగా ఎప్పటి లాగే ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్, కేవలం 10 పరుగులు చేసి వెనుతిరిగాడు. దీంతో సంజు స్థానంలో వైభవ్ సూర్యవంశీని తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దింపాలని కోరుతున్నారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

వందేమాతరంపై వివాదం…జాతీయ గీతాన్ని అవమానించారంటూ !

Advertisement

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరిగింది. అయితే ఈ తొలి టి20 సందర్భంగా మొదటి సారిగా జాతీయగీతం జనగణమన తో పాటు జాతీయ గేయం వందే మాతరం కూడా ఆలపించారు టీమిండియా క్రికెటర్లు. ఇలా ఒకేసారి జాతీయ గీతంతో పాటు గేయం పాడడం హిస్టరీలోనే మొదటిసారి. అయితే ఈ అద్భుతమైన ఘట్టంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన తర్వాత జనగణమన ఆలపించారు క్రికెటర్లు. ఇప్పుడు ఇదే అంశం వివాదంగా మారింది. వందేమాతరం మొదట పాడడంపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. మొదట జనగణమన పాటించిన తర్వాత వందే మాతరం పాడితే బాగుండని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అందరు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేస్తున్నారు. జనగణమన అందరికీ ముఖ్యమని అంటున్నారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

 

 

Related News

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు వచ్చారు..లంక చేతిలో చిత్తుగా ఓడిపోవడం పక్కా

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

Big Stories

Advertisement
×