Razaullah Warned India: పాకిస్తాన్ డేంజర్ బౌలర్ రజావుల్లా ఖాన్ (Razaullah Khan Mashwani) ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (England vs. Pakistan) మధ్య మూడవ టెస్ట్ జరిగిన నేపథ్యంలో… అనూహ్యంగా రజావుల్లాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ పాకిస్తాన్ యంగ్ బౌలర్ రజావుల్లా, వికెట్లు తీయడమే కాకుండా 81 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో రజావుల్లా ఖాన్ పేరు మారుమోగుతోంది. తొలి మ్యాచ్ తోనే పాపులర్ అయిన రజావుల్లా ఖాన్, ఇండియాపై మాత్రం అక్కసు వెళ్ళగచ్చాడు. అడుగడుగునా టీమిండియాను ఓడించడమే తన లక్ష్యం అంటూ బాంబు పేల్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియాను ఓడిస్తానని శపథం చేశారు. టీమిండియాను ఓడించే వరకు నిద్రపోనని ప్రకటన చేశారు రజావుల్లా ఖాన్. ఈ క్రమంలో రజావుల్లా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు ఫాస్ట్ బౌలర్ రజావుల్లా ఖాన్ (Razaullah Khan Mashwani). అయితే ఒక్క మ్యాచ్ కే పాపులర్ అయిన రజావుల్లా ఖాన్ కు ఒళ్లంతా కొవ్వెక్కినట్లు కనిపిస్తోంది. టీమిండియా పై తొలి మ్యాచ్ పూర్తికాగానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా తాను సిద్ధమవుతున్నానని ప్రకటన చేశారు రజావుల్లా ఖాన్. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా తాను పాకిస్తాన్ జట్టులో ఉంటానని వివరించారు. ఆ దిశగా ఇప్పటి నుంచి కసరత్తులు మొదలు పెట్టానని ప్రకటించారు.
ఇక 2027 వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియాను అడుగడుగునా ఓడిస్తామని.. ఆ బాధ్యత తానే తీసుకుంటానని వెల్లడించారు రజావుల్లా ఖాన్ (Razaullah Khan Mashwani). ఇండియాను ఓడించి ఇంటికి పంపే వరకు నిద్రపోనని.. అల్లా సాక్షిగా ప్రకటిస్తున్నట్లు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీమిండియాను ఓడించడం తన చిన్ననాటి కల అంటూ బాంబు పేల్చారు. ఆ అతిపెద్ద వేదికపై ఈ కలను నిజం చేయాలనుకుంటున్నానని రజావుల్లా ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ సిరీస్ లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన రజావుల్లా ఖాన్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. అంతేకాదు ఇంగ్లాండ్ సిరీస్ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ లో అడుగు పెట్టిన ప్లేయర్లెవరికీ మంచి ఆహ్వానం దక్కలేదు. కానీ రజావుల్లా ఖాన్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. విమానాశ్రయంలో భారీ స్వాగతం పలికి.. ఊరేగింపుగా అతనిని తీసుకువెళ్లారు.