Vaibhav Suryavanshi Teasing Shivam Dube: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ప్రస్తుతం 3 T20 ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ రెండింటిలో టీమ్ ఇండియా విజయం సాధించి, 2-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మూడవ టి20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదుగుతున్న వైభవ్, సీనియర్ క్రికెటర్లను టీజింగ్ చేసిన సంఘటన వివాదంగా మారింది.
టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మంగళవారం రోజున రెండో టి20 జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా తుది జట్టులో స్థానం దక్కించుకోలేని 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, శివం దూబేను ఉద్దేశించి టీజ్ చేశాడు. పందిలా బలిసావ్ ? నీ వల్ల ఏం ప్రయోజనం అన్నట్లుగా శివం దుబే ముందు ఓవరాక్షన్ చేశాడు. పక్కన నిలబడ్డ శివం దూబే, చేతి మజిల్స్ పట్టుకొని… నాకంటే లావుగా ఉన్నావని హాట్ కామెంట్స్ చేశాడు. రెగ్యులర్ గా జిమ్ చేసి, బాగా బలిసావ్ అన్న రేంజ్ లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.
కానీ నీ వల్ల టీమిండియా కు ఎలాంటి లాభం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపించాడు వైభవ్. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో శివం దూబే సీరియస్ గా తీసుకోలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ల పట్ల వైభవ్ సూర్య వంశీకి ఎలాంటి గౌరవం లేదని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే సీనియర్ క్రికెటర్లను తొక్కేస్తాడని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడే తోక కట్ చేయాలని బీసీసీఐకి సూచనలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రెండో టి20 మంగళవారం అంటే సెప్టెంబర్ 15వ తేదీన జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 14.5 ఓవర్లలో చేదించింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకొని సిరీస్ కైవసం చేసుకుంది.
Vaibhav Suryavanshi teasing Shivam Dube while comparing their arms 😂🔥
Suryavanshi be like, “Kya fayada itna GYM karne Ka, barabar hi to hai!” 🤣 pic.twitter.com/t9QHfdrMYV
— Mukku (@Cric_Mukku) September 15, 2026