Kris Srikkanth slams Gambhir: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (Afghanistan vs India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( Afghanistan vs India in India 2026) జరుగుతోంది. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి మ్యాచ్ పూర్తికాగా… ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ( Arun Jaitley Stadium, Delhi) రెండో టి20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ షురూ కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆడడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. గత మ్యాచ్ లోనే అతడిని పక్కకు పెట్టడంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth ) సీరియస్ అయ్యారు. రెండో టి20 లో అయినా వైభవ్ ను ఆడించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తన భార్య విడాకులు ఇచ్చే ప్రమాదం పొంచి ఉందంటూ బాంబు పేల్చారు శ్రీకాంత్.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ రెండో టి20 జరగనున్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని గౌతమ్ గంభీర్ ను కోరారు క్రిస్ శ్రీకాంత్. గత మ్యాచ్ లో సంజు శాంసన్ ను ఆడిస్తే విఫలమయ్యాడని.. ఈ క్రమంలో వైభవ్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎలాగూ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టే కాబట్టి.. వైభవ్ కు ఛాన్స్ ఇవ్వాలని నొక్కి చెప్పారు. జింబాబ్వే తో జరిగిన గత సిరీస్ లో 151 పరుగులు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
అంతేకాదు 196 స్ట్రైక్ రేట్ తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా వైభవ్ నిలిచాడని… అలాంటి ఆటగాడిని పక్కకు పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. జింబాబ్వే పై అద్భుతంగా రాణించిన వైభవ్ ను పక్కకు పెట్టడంపై తన భార్య సైతం తీవ్ర ఆగ్రహానికి గురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ కోసమే టీమిండియా మ్యాచ్ ను తన భార్య చూస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ తుది జట్టులో లేకపోతే తనతో గొడవ పెట్టుకుంటోందని బాంబు పేల్చారు. రెండో టి20 లో అయినా వైభవ్ను ఆడించాలని రిక్వెస్ట్ చేశారు. లేకపోతే విడాకులే ఇస్తానని తన భార్య వారిని ఇచ్చే ప్రమాదం ఉందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీకాంత్.
ఇది ఇలా ఉండగా… టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఇవాళ జరిగే రెండో టి20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి సంజు శాంసన్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సంజు శాంసన్ అద్భుతంగా ఆడి, జట్టును చాంపియన్ చేశాడు. అలాంటి వాడికి ఒకటి లేదా రెండు అవకాశాలు ఇవ్వడం కరెక్ట్ కాదని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. 15 ఏళ్ల కుర్రాడి కోసం అతడిని బలి చేయడం టీమిండియా యాజమాన్యానికి ఏ మాత్రం ఇష్టం లేదని నివేదికలు చెబుతున్నాయి.