Womens Asia Cup 2026 Finals IND VS SL: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Asia Cup 2026 tournament ) విజేతగా అందరూ ఊహించినట్లుగానే టీమిండియా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ఒక్క ఓటమి లేకుండా చివరి వరకు గెలుస్తూ వచ్చిన ఉమెన్స్ టీమిండియా, 2026 ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ క్రమంలో 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టును అన్ని విధాల దెబ్బ కొట్టి… 72 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియానే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ టీం, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఐదు వికెట్లు నష్టపోయిన ఉమెన్స్ టీమ్ ఇండియా 183 పరుగులు సాధించింది.
ఓపెనర్లు షెఫాలీ వర్మ 68 పరుగులు చేయగా, స్మృతి మందాన 59 పరుగులతో ఇరగదీశారు. దీంతో టీమిండియా ఉమెన్స్ టీం ఫైనల్స్ లో భారీ స్కోర్ చేయగలిగింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడుతూ లేస్తూ శ్రీలంక ఉమెన్స్ టీం పోరాడింది. అయినప్పటికీ మ్యాచ్ మాత్రం గెలవలేక చేతులెత్తేసింది. టీమిండియా ఉమెన్స్ టీం విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన శ్రీలంక ఉమెన్స్ టీమ్, 111 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో 8వ సారి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా ఉమెన్స్ టీం.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. ఈ క్రమంలో చాంపియన్ అయిన టీమ్ ఇండియాకు ఒక్క రూపాయి కూడా రాబోదు. ప్రైజ్ మనీ గా వచ్చిన డబ్బులను బీసీసీఐ అస్సలు స్వీకరించబోదు. వచ్చిన ప్రైజ్ మనీ (Asia Cup 2026 tournament prize money)సొమ్మును ఆసియా ఖండంలోని ఇతర చిన్న క్రికెట్ బోర్డుల అభివృద్ధి అలాగే మౌలిక సదుపాయాల కోసం బీసీసీఐ మళ్ళీ విరాళంగా ఇస్తుంది. అయితే టీమిండియా కాక ఫైనాన్స్లో శ్రీలంక గెలిచి ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం ప్రైజ్ మనీ తీసుకునేది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.16 నుంచి రూ.20 లక్షల వరకు ప్రైస్ మనీ అందిస్తారు. అంటే ప్రైజ్ మనీ కింద వచ్చిన ఈ డబ్బులను ఆసియా ఖండంలోని ఇతర చిన్న జట్లకు ఖర్చు పెడుతుంది బీసీసీఐ.