E-Paper
Advertisement

Most liked instagram photo: ఆ హీరోయిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఎక్కువమంది లైక్ చేసిన ఫొటో ఇదే

Most liked instagram photo: ఆ హీరోయిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఎక్కువమంది లైక్ చేసిన ఫొటో ఇదే
Advertisement

Most liked instagram photo in India: సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోంది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ అందుకున్న ఫొటోను స్టార్ క్రికెటర్ షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటోను ఎక్కువమంది లైక్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అయ్యింది.

17 ఏళ్ల తరువాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు.. 11 ఏళ్ల తరువాత ఓ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భాన్ని దేశమంతా పండుగ వాతావరణంలా జరుపుకుంది. టీమిండియా విజయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అందులో రోహిత్ శర్మ ట్రోఫీ అందుకోగా, మిగిలిన టీం మెంబర్స్ సంబరాలు జరుపుకుంటున్న ఫొటోను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

Advertisement

ఈ ఫొటోకు భారీ స్పందన వచ్చింది. ఏకంగా 1.8 కోట్ల మేరకు లైక్స్ వచ్చాయి. దీంతో ఇండియాలో ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఎక్కువమంది లైక్ చేసిన ఫొటోగా ఈ ఫొటో నిలిచింది. అయితే, ఇప్పటివరకు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానా పెళ్లి ఫొటో పేరిట ఉన్న రికార్డు బ్రేకయ్యింది. ఈ ఫొటోకు 1.6 కోట్ల మంది లైక్ కొట్టారు. అయితే, కోహ్లీ షేర్ చేసిన ఈ ఫొటో కేవలం ఒక్క రోజులోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Advertisement

ఇన్‌స్టా‌గ్రామ్‌లో కోహ్లీ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇలాంటి రోజును మించిన రోజును నేను కోరుకోలే. దేవుడు గొప్ప వ్యక్తి. ఆయన ముందు నేను తల వంచి నమస్కరిస్తున్నా. మేము చివరికి సాధించేశాం. జై హింద్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. గతేడాది ఫిబ్రవరిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న ఫొటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోకు 1.6 కోట్ల లైక్స్ వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ ఫొటో పేరిటే రికార్డు ఉండేది. ఇంతకంటే ముందు ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి ఫొటో పేరిట రికార్డు ఉండేది. ఆ ఫొటోకు 1.31 కోట్ల లైక్స్ వచ్చాయి. అయితే, విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫొటో మాత్రం ఈ రికార్డులను బ్రేక్ చేసింది. అది కూడా ఒక్కరోజులోనే. రానున్న రోజుల్లో ఇంకెన్ని లైక్స్ వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఫైనల్ మ్యాచ్ లైవ్ ఎంతమంది చూశారో తెలుసా?

ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ షేర్ చేసిన ఫొటోకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా లైక్స్ వచ్చాయి. అర్జెంటినా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫొటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోకు 7.53 కోట్ల లైక్స్ వచ్చాయి. ఆ లెక్కన చూస్తే కోహ్లీ ఫొటో ఇంకా చాలా దూరంలోనే ఉన్నా.. అది కూడా రికార్డ్ బ్రేక్ చేయొచ్చంటున్నారు నెటిజన్స్.

Tags

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×