Shreyas Iyer On Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Rajasthan Royals vs Mumbai Indians) మధ్య ప్లే ఆఫ్స్ జట్టును ఫైనల్ చేసే మ్యాచ్ జరగబోతోంది. ముంబైలోని వాంఖడే ( Wankhede Stadium, Mumbai) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇవాళ మూడున్నర గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చావో రేవో అన్నట్లుగా ఈ మ్యాచ్ మారింది. ఇందులో గెలిస్తేనే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Mumbai Indians) మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నిన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) కీలక ప్రకటన చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ పైన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం ఫుల్ జోష్ లో కనిపించిన శ్రేయస్ అయ్యర్, ముంబై ఇండియన్స్ గెలవాలని తాము పూజలు చేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు శ్రేయస్ అయ్యర్.
ముంబై ఇండియన్స్ చాలా రోజులుగా విఫలమవుతూ వస్తోంది.. కానీ వాళ్ల సొంత మైదానంలో ఆదివారం మ్యాచ్ జరుగుతోందని వెల్లడించారు. ఈ తరుణంలో తమ కోసమైనా రాజస్థాన్ రాయల్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడిస్తుందని నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇక అంతా దేవుడిపై భారం వేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అటు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంపైర్లను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి మొత్తానికి రాజస్థాన్ ను ఇంటికి పంపించండి అంటూ నీతా అంబానీని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నిన్న లక్నో పైన గెలిచిన పంజాబ్.. నాలుగో స్థానానికి దూసుకు వచ్చింది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో రాజస్థాన్ గెలిస్తే చాలు… ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అటు పంజాబ్ కింగ్స్ ఇంటికి వెళుతుంది. ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే.. పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది. బరిలో కేకేఆర్ ఉన్నప్పటికీ.. వాళ్లకు కేవలం 5% ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రాజస్థాన్ అలాగే పంజాబ్ మధ్య మాత్రమే నాలుగో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఇవాళ ఎవరు ఫైనల్ గా నాలుగో స్థానానికి వెళ్తారో చూడాలి.
Shreyas Iyer hoping to support Mumbai Indians 😁#IPL2026 #ShreyasIyer #Cricket pic.twitter.com/SzIYdTYdW1
— InsideSport (@InsideSportIND) May 23, 2026