E-Paper
Advertisement

Ind vs pak: పాక్ చేతిలో ఇండియా ఓటమి.. వివాదంగా మారిన క్యాచ్.. ఔటా? నాటౌటా? రూల్స్ ఏం చెబుతున్నాయి

Ind vs pak: పాక్ చేతిలో ఇండియా ఓటమి.. వివాదంగా మారిన క్యాచ్.. ఔటా? నాటౌటా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement

Ind vs pak: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం రోజు దోహా వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఏ – పాకిస్తాన్ షాహీన్స్ మధ్య మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ మ్యాచ్ మొత్తం వివాదాస్పదంగానే నడిచింది. అంపైర్ల నిర్ణయంతో మ్యాచ్ గందరగోళంగా మారింది. మ్యాచ్ లోని ప్రతి నిర్ణయం పాకిస్తాన్ కి ఫేవర్ గా వెళ్లడంతో టీమిండియా ప్లేయర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!

Advertisement

భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ లు అన్ని పాకిస్తాన్ బౌలర్లకు దక్కగా.. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో క్లియర్ క్యాచ్ లు కూడా నాట్ అవుట్ ఇచ్చేసి ఓ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పారు. ఇలా అంపైర్ల నిర్ణయాలతో టీమిండియాకు భారీ నష్టమే జరిగింది.

పాకిస్తాన్ పై భారత్ ఓటమి:

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగింది. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ మరోసారి విరుచుకుపడ్డాడు. ఇండియా జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. అయితే వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత పదవ ఓవర్ లో సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్ లో మహమ్మద్ ఫైక్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు క్రీజ్ లో ఉండగా జట్టు స్కోరు 91/2 గా ఉన్నప్పటికీ.. అతడు పెవిలియన్ చేరిన వెంటనే ఇండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోయి 104/6 కి పడిపోయింది. ఆ తర్వాత చివరికి 136 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.

Advertisement

పాకిస్తాన్ బౌలర్లలో షాహిద్ అజీజ్ 3, మాజ్ సదాఖత్, సాదు మసూద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ చిన్న లక్ష్యాన్ని చేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాటర్లు ధాటిగా ఆడి మ్యాచ్ ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్ జట్టు కేవలం 13.2 ఓవర్ లోనే నిర్ణీత లక్ష్యాన్ని చేదించింది. పాకిస్తాన్ ఓపెనర్ మాజ్ సదాకత్ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచి పాకిస్తాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యష్ ఠాకూర్, సుయాష్ శర్మ చెరో వికెట్ తీశారు. ఇక ఈ విజయంతో పాకిస్తాన్ సెమీఫైనల్ కి క్వాలిఫై అయింది. రెండవ బర్త్ కోసం భారత్ ఏ తో పాటు ఒమన్ ఏ బరిలో ఉంది. ఈనెల 18న తదుపరి మ్యాచ్ లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సెమిస్ కి చేరుతుంది.

Also Read: Ganguly: మీరు అడిగిన పిచ్ ఇచ్చారు.. కానీ ఎందుకు గెలవలేదు రా..!

వివాదంగా మారిన క్యాచ్:

ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ ప్లేయర్ సదాకత్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర నేహాల్ వధేరా అందుకొని.. దానిని గాల్లోకి విసిరి రోప్ దాటాడు. ఇక అక్కడే ఉన్న మరో ఫీల్డర్ నమన్ క్యాచ్ పూర్తి చేశాడు. అయితే రోప్ కి టచ్ కాకపోయినా అంపైర్లు నాటౌట్ ఇవ్వడంతో భారత ప్లేయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా బంతి డెడ్ అయ్యే లోపు ఫీల్డర్ రోప్ లోపల ఉండాలని ఇటీవల రూల్స్ మార్చిన కారణంగానే నాటౌట్ గా ప్రకటించారని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ ఆశుతోష్ శర్మను వివాదాస్పదంగా అవుట్ ఇవ్వడంతో మైదానంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అంపైర్ నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేసిన అశుతోష్.. క్రేజ్ లో నుండి కదిలేందుకు కూడా అంగీకరించలేదు. కానీ చివరికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

?igsh=ZTk3bWh4amd4M2ht

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×