E-Paper
Advertisement

CM Progress Report: సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. పెట్టుబడులు ఎన్ని వేల కోట్లంటే..!

CM Progress Report: సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. పెట్టుబడులు ఎన్ని వేల కోట్లంటే..!

CM Progress Report: విశాఖలో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. సీఐఐ చరిత్రలో ఇంత బాగా సదస్సు జరగడం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రోజుల సమ్మిట్‌లో 613 ఎంవోయూలు కుదిరాయి. మొత్తంగా.. 13 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులు ఏపీకి రానున్నాయ్. ఒకప్పుడు ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ.. తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. శ్రీకాకుళంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు.. కేంద్రంతో ఎంవోయూ కుదిరింది. రాబోయే మూడేళ్లలో ఏపీలో గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరగనుంది.

నవంబర్ 10, సోమవారం ( పటిష్ట ఏర్పాట్లు )
శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధాని నరేంద్రమోదీ, 22 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీకి రానుననారు. ఈ క్రమంలో.. పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రముఖుల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నవంబర్ 10, సోమవారం ( సంక్షేమంపై ఆరా )
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాభిప్రాయం లాంటి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు.. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రివ్యూ చేశారు. రేషన్ పంపిణీ, దీపం 2.0 అమలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల పనితీరును అంచనా వేశారు.

నవంబర్ 10, సోమవారం ( ఎకనమిక్ రీజియన్‌గా విశాఖ )
అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఈ వారం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు.. వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు. దీనికి సంబంధించి సంబంధిత జిల్లాల్లోని ఆర్థిక వ్యవస్థ, రావాల్సిన పెట్టుబడులు, పెరగాల్సిన జీవన ప్రమాణాలు, సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి తదితర అంశాలతో.. ఎకనామిక్ మాస్టర్ ప్లాన్‌ని రూపొందించనున్నారు.

నవంబర్ 10, సోమవారం ( కేబినెట్ కీలక నిర్ణయాలు )
సుమారు 70 అజెండా అంశాలపై.. ఈ వారం ఏపీ క్యాబినెట్ చర్చించింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై.. సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపులకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ లాంటి కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేనివారి లిస్ట్ తయారుచేసి.. అందరికీ ఇళ్లు దక్కేలా చూడాలన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని.. త్వరతగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని చెప్పారు. ఇక.. మొంథా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణసాయం అందేలా చేశారని అభినందించారు. ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించగలిగామన్నారు. అంతా కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానని.. మంత్రులను సీఎం అభినందించారు.

నవంబర్ 11, మంగళవారం ( మరింత సహకారం )
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పీడీఎంసీ స్కీమ్ కింద ఏపీకి అదనపు నిధులు కేటాయించాలని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో.. సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ అంశాలపై చర్చించారు. మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి.. సీఎం వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి.. కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చంద్రబాబు కోరారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి 695 కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద తోతాపూరి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో.. కేంద్ర ప్రభుత్వ వాటా 100 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు.

నవంబర్ 11, మంగళవారం ( తుపాను నష్టంపై రివ్యూ )
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడ్డ మొంథా తుపాను నష్టంపై అంచనాలు రూపొందించేందుకు.. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. మొత్తంగా.. 5 వేల 267 కోట్ల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా 2 వేల 622 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు.

నవంబర్ 11, మంగళవారం ( పరిశ్రమలు – ఉపాధి కల్పన )
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని లింగన్నపాలెంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో భాగంగా.. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు సీఎం. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా.. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదన్నారు చంద్రబాబు. విద్యార్థుల చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత తనదన్నారు సీఎం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయన్నారు. 175 నియోజక వర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి.. ప్రతి కుటుంబంలో ఓ వ్యాపారవేత్తను తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.

నవంబర్ 12, బుధవారం ( 3 లక్షల ఇళ్ల పంపిణీ )
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 3 లక్షల ఇళ్లను.. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో లబ్ధిదారులకు అందజేశారు. 17 నెలల్లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తమది పేదల ప్రభుత్వమని స్పష్టం చేస్తూ.. వారికి న్యాయం చేసేందుకు పని చేస్తామని హమీ ఇచ్చారు. అదేవిధంగా సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పత్రాలను అందచేశారు. రాబోయే మార్చిలోపు మిగిలిన 5 లక్షల 80 వేల ఇళ్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలోని దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి.. గృహ ప్రవేశం చేశారు. లబ్ధిదారులు హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు కొత్త బట్టలు బహూకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం తర్వాత నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.

నవంబర్ 13, గురువారం ( ఇండియా-యూరప్ మధ్య సహకారం )
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు విశాఖపట్నంలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్‌కి.. ఆర్మేనియా ఆర్థిక వ్యవహరాల మంత్రి గివార్గ్ పొపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా లాంటి దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన ఛైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హజరయ్యారు.

నవంబర్ 13, గురువారం ( నేవీ కోసం )
సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా.. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇద్దరూ చర్చించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

నవంబర్ 13, గురువారం ( పెట్టుబడులకు స్వర్గధామం )
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షించింది. గురువారం ఒక్కరోజే.. సుమారు 35 సంస్థలు 3 లక్షల 65 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్ని అమలైతే.. రాష్ట్రంలో 16 లక్షల 31 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్న వెంటనే.. ప్రభుత్వం ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎం గ్రీన్ మెటల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీగ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జెఎం బాక్సీ లాంటి 41కి పైగా సంస్థలు ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల శాఖలకు సంబంధించి వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో 4 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు.

నవంబర్ 14, శుక్రవారం ( ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ ఏపీ )
సీఐఐ సదస్సు ప్రారంభమవడానికి ముందే.. ఏపీ ప్రభుత్వం వివిధ కంపెనీలతో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు.. తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయ్. రెన్యూ పవర్ సంస్థ రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రెన్యూ పవర్ సంస్థ పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది.

నవంబర్ 15, శనివారం ( సీఐఐ సూపర్ హిట్ )
విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కు రూ.13 లక్షల 25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. దావోస్ తరహాలో జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండు రోజుల్లో 67 సెషన్లు, 700కు పైగా బీటూబీ సమావేశాలు జరిగాయి. మొత్తం 613 ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
బైట్.. సీఎం చంద్రబాబు

నవంబర్ 15, శనివారం ( శ్రీసిటీలో మరో 12 ప్రాజెక్టులు )
విశాఖ CII భాగస్వామ్య సదస్సు వేదికగా.. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీ సిటీలోని 5 యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించగా, కొత్తగా ఏర్పాటు చేయబోయే 12 ప్రాజెక్టులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగాలలో 2320 కోట్ల పెట్టుబడులతో శ్రీ సిటీలో ప్రాజెక్టుల ఏర్పాటు జరుగుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా 12 వేల 365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

Also Read: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

నవంబర్ 15, శనివారం ( ఎయిర్‌పోర్ట్‌కు ఎంవోయూ )
శ్రీకాకుళంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఎంవోయూ కుదిరింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×