E-Paper
Advertisement

Pak Demand ICC: పాకిస్తాన్ లో టీమిండియా అడుగుపెడితేనే మ్యాచ్ ఆడ‌తాం, 3 కండీష‌న్లు పెట్టిన PCB

Pak Demand ICC: పాకిస్తాన్ లో టీమిండియా అడుగుపెడితేనే మ్యాచ్ ఆడ‌తాం, 3 కండీష‌న్లు పెట్టిన PCB
Advertisement

Pak Demand ICC:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ ఒక్కో మెట్టు దిగినట్లు తెలుస్తోంది. మొదట ఇండియాతో మ్యాచ్ ఆడబోమని డ్రామాలు ఆడింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. రకరకాల కారణాలు చెప్పి బహిష్కరించింది. ముందుగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అలాగే ఇండియా దారుణంగా వ్యవహరించిందని కారణం చూపించి పాకిస్తాన్ కుట్రలకు తెరలేపింది. ఆ తర్వాత టోర్నమెంట్ ఆడేందుకు కొలంబోకు వచ్చింది పాకిస్తాన్. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడబోమని కొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ఐసీసీ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో దిగి వచ్చింది. కానీ మూడు కండిషన్లు తాజాగా ఐసీసీ ముందు PCB ఉంచినట్లు తెలుస్తోంది.

Also Read: Smriti Mandhana Mother: ప‌లాష్ పెద్ద మోస‌గాడు..వాడిపై ప‌గ‌తో నా బిడ్డ ఆడింది, RCB విజ‌యంపై స్మృతి త‌ల్లి పోస్ట్‌ వైర‌ల్

ఐసీసీ ముందు మూడు కండిషన్లు పెట్టిన పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే మూడు కండిషన్లు పెట్టిందట పాకిస్తాన్. ఇందులో మొదటిది ఐసీసీ t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా అన్ని జట్ల కంటే రెవెన్యూ షేర్ ఎక్కువగా ఇవ్వాలని కోరిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే ఇండియాతో మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా షేక్ హ్యాండ్ (Shake Hands)  ఇచ్చుకోవాల్సిందేనని కూడా తెలిపిందట. గతంలో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమిండియా ప్లేయర్లు.

అయితే అలాంటి సీన్లు ఇప్పుడు రిపీట్ కావద్దని పేర్కొందట. ఇక ముచ్చటగా మూడవది చాలా విడ్డూరంగా ఉంది. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఎప్పుడు చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో అడుగుపెట్టి ద్వైపాక్షిక సిరీస్ ( India–Pakistan bilateral series) ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడు కండిషన్లకు ఓకే అయితే ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) వెల్లడించిందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియా అస్సలు ఒప్పుకునే ఛాన్సే లేదు

Advertisement

ఐసీసీ ముందు మూడు కండిషన్లు పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు బిసిసిఐ షాక్ ఇవ్వనుందట. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదని బిసిసిఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంలో తమ జట్టు అస్సలు ప్రకటించబోదని.. తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్ 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×