E-Paper
Advertisement

Telangana BRS: టికెట్ల లొల్లి.. రెబల్స్ హల్చల్.. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తున్న అంతర్గత కుమ్ములాటలు

Telangana BRS: టికెట్ల లొల్లి.. రెబల్స్ హల్చల్..  మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తున్న అంతర్గత కుమ్ములాటలు
Advertisement

Telangana BRS: భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని తొలిసారి మున్సిపల్ ఎన్నికలు సిద్దమైన గులాబీపార్టీలో అసమ్మతి రాగాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయంట. పార్టీ పేర్చుకున్న తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న టెన్షన్‌కి తోడు, టికెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు బావుటాలు ఎగరవేస్తుండంటో జిల్లాల్లోని నాయకులు ఆందోళన చేందుతున్నారట. సీటు దక్కని నేతలు పలుచోట్ల రెబల్స్‌ రూపంలో ఎన్నికల బరిలో నిలవడం గులాబీ నేతలకు సవాలుగా మారిందట. … ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ వ్యూహాలతో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని నిద్రలేనిరాత్రులు గడిపేలా చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో అసంతృప్తి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. మరికొద్ది గంటల్లో ప్రచారంపర్వం ముగుస్తుంది. అంటే యుద్ధం చివరంకానికి చేరుతున్న తరుణంలో మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయంట. ఆర్థిక స్థోమతే ప్రామాణికంగా బీఆర్ఎస్ టికెట్లు కేటాయించడంతో… ముందు నుంచి పార్టీతో ఉన్న వారు, ఉద్యమకారులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారట. పలువురు మాత్రం సైలెంట్ గా ఉంటూ పార్టీ ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వివిధ మున్సిపాలిటీల్లో పార్టీ రెబల్స్ పోటీలో ఉండటం ఎన్నికల ఇన్చార్జులకు తలనొప్పిగా మారిందంటున్నారు.

జిల్లా ఇన్చార్జుల మధ్య తారుమారు

Advertisement

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవాల నుంచి బయటపడి, క్యాడర్లో ఉత్సాహం నింపడానికి పురపోరులో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ పావులు కదపాలని చూస్తోంది. అయితే రెబల్స్‌తో పాటు అసంతృప్తి నేతల బెడద పార్టీ ముఖ్యనేతలను టెన్షన్ పెడుతోందంట. మొదటి నుంచి పనిచేస్తున్నవారికి టికెట్లు ఇవ్వలేదని పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ, అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మున్సిపాల్టీలలో జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకులు, నియోజకవర్గ ఇన్చార్జుల మధ్య విభేదాలు ప్రస్పుటమవుతున్నాయి. పార్టీ బీఫారాలలో తమవర్గానికి ఇవ్వలేదని ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారంట.

మున్సిపాలిటీల్లో అసంతృప్తి.. టికెట్లు రాని నేతల ఆగ్రహం

ఎన్నికల్లో సీటు దక్కని నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, పాలమూరు జిల్లాలో టికెట్ల పంచాయితీలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ల విషయంపై నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. టికెట్లు ఇవ్వలేదని పార్టీలో పనిచేసే సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఇంచార్జ్‌ల ఎదుటే ఆందోళనలను దిగారు. ప్రచార కర పత్రాలను, పోస్టర్లను చించి నిప్పంటించారు. అంతేకాకుండా కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లోకి కరప్రతాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో టికెట్లు రాని నేతలు తీవ్రఅసంతృప్తితో కనిపిస్తున్నారు. ఆ క్రయంలో వారు పోలింగ్ రోజు వారి పోషించే పాత్రపై పెద్ద చర్చే జరుగుతోంది.

కవిత విమర్శలతో గులాబీ పార్టీకి తలనొప్పి

Advertisement

ఓవైపు పార్టీలో అంతర్గత విభేదాలు, టికెట్లు దక్కని నేతల అసంతృప్తులు, ఆందోళనలు పార్టీ నాయకత్వాన్ని టెన్షన్‌కి గురిచేస్తుంటే…మరోవైపు కవిత రూపంలో ఎదరవుతున్న సమస్యలతో గులాబీ పార్టీ నాయకత్వం సతమతమవుతోందంట. జాగృతి జనం యాత్రలో కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యే తప్పిదాలను ఎండగట్టారు. ఆ సమయంలో కొంతమంది గులాబీ నేతలు ఆమె విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆమె రాజకీయంగా ఎదిగితే గులాబీ పార్టీకే నష్టమని అందుకే ఏదో ఇవ్వాలన్నట్లు తూతూమంత్రంగా కౌంటర్‌లు ఇచ్చారని ఆ పార్టీలోనే చర్చజరుగుతోంది.

తెలంగాణ 35 మున్సిపాలిటీలలో కవిత ప్రభావం

కుటుంబం తనను ఒంటరిని చేసిందని కవిత సంధిస్తున్న సెంటిమెంట్ అస్త్రాలతో బీఆర్ఎస్‌కు జరగాల్సిన నష్టం ముందే జరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతికి చెందిన నేతలు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొత్తగూడెం ఎక్కువ మంది బరిలో ఉన్నారు. అవి కాకమరో 35 మున్సిపాలిటీల్లో వారు పోటీ చేస్తున్నారు. అందులోనూ వారంతా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేస్తున్నారు. అది బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తోందని గులాబీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. కవిత చీల్చే ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్‌వే అవుతాయని, దాంతో భారీ ఎఫెక్టు పడుతుందని గులాబీ నేతలు భయపడుతున్నారంట.

అదనపు విమర్శలు.. ఆదరణ లేని అభ్యర్థులపై ఫోకస్

ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పినవారికే టికెట్లు ఇవ్వడంతో, ఆయా మున్సిపాలిటీల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా విజయం సాధిస్తుందనేది ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదంట. పార్టీ సర్వేలతో టికెట్లు ఇచ్చామని చెబుతున్నప్పటికీ కేడర్ మాత్రం ఆదరణ లేనివారికే పెద్దపీట వేశారని విమర్శిస్తోంది. మరి ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న లక్షాన్ని ఎలా చేరుకుంటుందో చూడాలి.

Also Read: భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. కీ హైలైట్స్ ఇవే..!

 Story by : Apparao, Big Tv

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×