Rajeev Shukla AI video: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముందుగా ఆడబోమని బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. కానీ ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ.. ఇండియా పైకి తోసేసే ప్రయత్నం మొదలుపెట్టింది పాకిస్తాన్ మీడియా. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. మాట్లాడిన ఓ వీడియోను ఎడిట్ చేసి.. బురద జల్లే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్.
Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజయం, సూపర్ 8లోకి ఎంట్రీ !
అంతేకాదు పాకిస్తాన్ తో కచ్చితంగా మ్యాచ్ జరగాలని ఇండియానే ప్రయత్నాలు చేసిందని రాజీవ్ శుక్లా మాట్లాడినట్లుగా ఏఐ వీడియోను ( Rajeev Shukla AI video) క్రియేట్ చేశారు. ఐసీసీని పదే పదే రిక్వెస్ట్ చేసి, పాకిస్తాన్ ఒప్పుకునేలా బీసీసీఐ ప్రాధేయపడినట్లు రాజీవ్ శుక్లా ( Rajeev Shukla ) వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ( shoaib malik) కూడా యూట్యూబ్ ఛానల్ లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా ప్రాధేయ పడుతోందని అర్థం వచ్చేలా కుట్రకు తెర లేపాడు. మన కాళ్ల దగ్గరకు బీసీసీఐ వచ్చిందని చెబుతూనే, రాజీవ్ శుక్లా ఏఐ వీడియోను ప్రదర్శించాడు సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో పై స్వయంగా బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా స్పందించారు. తన వాయిస్ ను ఏ ద్వారా మార్చి, తప్పుడు మెసేజ్ ను జనాల్లోకి తీసుకువెళ్లారని పాకిస్తాన్ పై ఫైర్ అయ్యారు రాజీవ్ శుక్లా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందని తాను మాట్లాడాను… దానికోసం ఐసీసీ ప్రయత్నం చేసిందని వెల్లడించారని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇండియా ప్రాధేయ పడిందని ఎక్కడ చెప్పలేదని.. ఆ అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా తమ వీడియోలను ఎడిట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు రాజీవ్ శుక్లా. ఇది ఇలా ఉండగా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీ మ్యాచ్ జరుగనుంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ఉంటుంది.
Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియన్ బ్యాట్లలో రబ్బర్లు, అందుకే భయంకరంగా ఆడుతున్నారు..విషం కక్కిన శ్రీలంక ప్లేయర్
🚨 PAKISTAN FAKE NEWS ABOUT BCCI 🚨
Pakistani show hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA, so that they can convince their audience that BCCI bow down to PCB😆
Shoaib Malik should be ashamed of this 😅 pic.twitter.com/HzYUgVvmcg
— Richard Kettleborough (@RichKettle07) February 11, 2026