Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చి చెప్పింది.ఓవరల్ గా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగించగా, కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ వివరించింది. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ లీడ్ పొందడం విశేషం. అయితే నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానున్నట్లు సర్వేలో వివరించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవని పీపుల్స్ పల్స్ తన సర్వేలో క్లియర్ కట్ గా తేల్చేసింది.
మరోవైపు రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ వివరించింది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నది. అదే విధంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు, మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో తేల్చారు. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నది. నిజామాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నది.కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందనున్నారు. ఓవరల్ గా 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ వివరించింది. అయితే సుమారు 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అనే టట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లు పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది.
Also Read: Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు గా 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచినట్లు స్పష్టమవుతోంది.ఒకప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన బీఆర్ఎస్ ఈసారి భారీగా చతికిలపడనుంది. కనీసం ప్రధాన పోటీలో కూడా నిలవలేక మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని అంచనా. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్నట్లు కనిపించిన బీజేపీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. కొన్ని పట్టణాలకే పరిమితం కానుంది.
తమ ఎగ్జిట్ పోల్ లో సుమారు 52.3 శాతం మేల్స్, 47.7 శాతం ఫీ మేల్స్ నుంచి శాంపిల్ సేకరించినట్లు పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది. ఇందులో 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్లు 16.8 శాతం మంది ఉన్నారు. అదే విధంగా 26 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్లు 25 శాతం, 36 నుంచి 45 ఏళ్ల మధ్య 28.7 శాతం, 46 నుంచి 60 శాతం వాళ్లు 20.2 శాతం, 60 ఏజ్ గ్రూప్ వాళ్లు 9.2 శాతం ఉన్నట్లు వివరించారు. ఇందులో ఎస్సీలు 18.4 శాతం, ఎస్టీ లు 6.1 శాతం, ఓబీసీ 51.1 శాతం, ఓసీలు 10.2 శాతం, ముస్లీంలు 11.5 శాతం, ఇతరులు 2.7 శాతం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ..తమ పాలనకు రెఫరెండం అంటూ ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు, పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62.09% పైగా పోలింగ్ నమోదు కావడం, మార్పు దిశగా ప్రజలు ఓటేశారని సూచిస్తోంది.ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం.
‘90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయాయి.తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజా పాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారు.ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి… ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచాయి.ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు వంటి కార్యక్రమాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయి.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటర్లలో సానుకూల భావనను కలిగించాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన అసత్యాలు, అవాస్తవాలను ప్రజలు నమ్మలేదు.
Also Read: Hydra: రూ. 1003 కోట్ల విలువైన సర్కారు భూమిని కాపాడిన హైడ్రా!