E-Paper
Advertisement

త‌ల‌కెక్కిన టిమ్ డేవిడ్ పొగ‌రు..ఆస్ట్రేలియా చేసిన త‌ప్పిద‌మే రిపీట్, ఇక RCB ప‌త‌న‌మే ?

త‌ల‌కెక్కిన టిమ్ డేవిడ్ పొగ‌రు..ఆస్ట్రేలియా చేసిన త‌ప్పిద‌మే రిపీట్, ఇక RCB ప‌త‌న‌మే ?
Advertisement

IPL 2026 Final:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఇప్పటికే 2025 ఫైనల్స్ లో విజయం సాధించిన బెంగుళూరు… ఈసారి కూడా టైటిల్ గెల్చుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్స్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో వరుసగా రెండోసారి ట్రోఫీ దక్కించుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది బెంగుళూరు. అయితే టైటిల్ అందుకున్న తర్వాత బెంగుళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన పని వివాదంగా మారింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పతనం మొదలైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియాకు పట్టిన గతే, ఇప్పుడు బెంగళూరుకు కూడా పట్టబోతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

వివాదంలో టిమ్ డేవిడ్, ఇక పతనం మొదలైనట్లేనా

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఛాంపియన్ అయింది. నిన్న అర్ధరాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్స్ గెలిచిన బెంగళూరు, టైటిల్ దక్కించుకుంది. ఈ క్రమంలో టైటిల్ పట్టుకొని బెంగుళూరు ప్లేయర్ లందరూ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అయితే జట్టు సభ్యుడు అయిన టిమ్ డేవిడ్ (Tim David ) మాత్రం ఓవరాక్షన్ చేశాడు. బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రోబో డాగ్ ను తన్నే ప్రయత్నం చేశాడు బెంగుళూరు ఆటగాడు టిమ్ డేవిడ్. చంపక్ (champak) అనే నామకరణం చేసిన ఈ రోబో కుక్కను.. కాలు పైకి ఎత్తి మరి తొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ఫాన్స్ సీరియస్ అవుతున్నారు. బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ చంపక్ ను అవమానిస్తావా ? కొంచమైన బుద్ధుందా ? అంటూ టిమ్ డేవిడ్ పైన సీరియస్ అవుతున్నారు. రోబో కుక్కను (IPL Robot Dog) అవమానిస్తే… బీసీసీఐని అవమానించినట్లేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆస్ట్రేలియాకు పట్టిన గత ఇప్పుడు బెంగళూరుకు పట్టబోతుందని హెచ్చరిస్తున్నారు.

RCBకి కూడా ఆస్ట్రేలియాకు పట్టిన గతే

2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో టైటిల్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్ చేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ తన బలుపు బయట పెట్టాడు. వరల్డ్ కప్ పైన కాళ్ళు పెట్టి మరి ఫోటోలు దిగాడు. ఈ క్రమంలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోలుకోలేని దెబ్బతింది. మొన్న టి20 ప్రపంచ కప్ సమయంలో కూడా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది ఆస్ట్రేలియా. అంతేకాదు ఆ సంఘటన తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా దక్కించుకోలేకపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ క్రమక్రమంగా పతనం అవుతోంది.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×