E-Paper
Advertisement

Ricky Ponting : రికీ పాంటింగ్‌కు గుండె నొప్పి.. ఆస్పత్రిలో చేరిక..

Ricky Ponting : రికీ పాంటింగ్‌కు గుండె నొప్పి.. ఆస్పత్రిలో చేరిక..
Advertisement

Ricky Ponting : ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ అస్వస్థతకు గురయ్యాడు.పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు కామెంట్రీ చేస్తుండగా పాంటింగ్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి. పాంటింగ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటకు ఛానెల్‌ 7 తరఫున పాంటింగ్‌ కామెంటటేర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు 40 నిమిషాలపాటు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. లంచ్‌ విరామం సమయంలో కామెంట్రీ బాక్స్‌ నుంచి పాంటింగ్ బయటకు వెళ్లాడని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించింది. పాంటింగ్‌ వెంట ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ వెళ్లాడు. ఛాతిలో నొప్పిరావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆసుప్రతిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.

Advertisement

1999 నుంచి 2007 వరకు వరసగా 3 ప్రపంచకప్‌లు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. అతని నాయకత్వంలోనే 2003, 2007 వన్డే ప్రపంచ కప్ లను ఆస్ట్రేలియా సాధించింది. 2006, 2009లో పాంటింగ్‌ నేతృత్వంలో ఆసీస్‌ వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం 47 ఏళ్ల పాంటింగ్ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×