Sakshi Singh Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నేపథ్యంలో… మహేంద్ర సింగ్ ధోని కుటుంబంలో కొత్త పంచాయతీ చోటుచేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి.. చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిన బాధలో మహేంద్రసింగ్ ధోని ఉంటే… ఆయన పచ్చడి కాపురం లోనే చిచ్చు నెలకొంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సంబంధించిన వీరాభిమాని… మహేంద్ర సింగ్ ధోనితో ( Ms Dhoni) ఫోటో దిగడమే ఇప్పుడు కొంపముంచింది. మహేంద్ర సింగ్ ధోని సెల్ఫీ దిగడమే కాకుండా… ఆ లేడీ ఫ్యాన్ పై చేతులు వేశాడు. ఆమె కూడా మహేంద్రసింగ్ ధోని పై చేతులు వేసి ఫోటో దిగింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్… చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ధోని కాపురంలో చిచ్చు పెట్టిన సెల్ఫీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… బుధవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కత్తా రైటర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఆడిన మహేంద్ర సింగ్ ధోని జట్టును గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత… కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సంబంధించిన అభిమానులు మహేంద్ర సింగ్ ధోనితో ఫోటోలు దిగారు. ఇందులో ఓ లేడీ కేకేఆర్ అభిమాని… ఒక అడుగు ముందుకు వేసి మహేంద్రసింగ్ ధోనితో క్లోజ్ గా కనిపించింది.
మహేంద్రసింగ్ ధోని తో ఫోటోలు కూడా దిగింది. అయితే మహేంద్రసింగ్ ధోని భుజాలపై చేతులు వేసి… కాస్త రొమాంటిక్ గా ఆ kkr అభిమాని ఫోటోలు దిగడం జరిగింది. ఇక ఆ ఫోటోను కేకేఆర్ కు సంబంధించిన జుహీ చావ్లా… తీయడం గమనార్హం. పక్కనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోని అలాగే ఆ కేకేఆర్ లేడీ అభిమాని ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ కంటపడ్డాయి.
దీంతో జార్ఖండ్లో ఉన్న మహేంద్ర సింగ్ సతీమణి సాక్షి ( Sakshi) సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మహేంద్ర సింగ్ ధోనీకి అర్ధరాత్రి ఫోన్ చేసి… మండిపడ్డారట సాక్షి సింగ్. అమ్మాయిలతో అలా క్లోజ్ గా దిగావు ఏంటి…? 40 ఏళ్ళు వచ్చిన అమ్మాయిల మోజు పోలేదా అంటూ… మహేంద్ర సింగ్ ధోనిని బండ బూతులు తిట్టారట సాక్షి సింగ్. దీనికి సంబంధించిన న్యూస్ నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధోని అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మాయి చేసిన తప్పుకు మహేంద్ర సింగ్ ధోనీని దోషిగా చూడకూడదని కోరుతున్నారు.