India Pak War: భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ పాలకులకు భయం పట్టుకుంది. భారత్ త్రివిధ దళాలను చూసి గజగజ వణికిపోతున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేస్తుంటే.. భారత్ సమర్థవంతంగా వాటిని ధ్వంసం చేస్తోంది.
పాక్ ఆర్మీ జమ్ము ఎయిర్ పోర్టుపై రాకెట్ దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీ పేలుళ్ల శబ్దం వచ్చింది. పలు చోట్ల డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. పాక్ దాడులకు భారత సైన్యం ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్ము ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. సైరన్లతో ఆర్మీ ప్రజలందరినీ అప్రమత్తం చేసింది.
Also Read: India Pak War: ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ.. పాక్‌కు భారత్ మరో స్ట్రాంగ్ వార్నింగ్
జమ్ము, కశ్మీర్, అఖ్నూర్, కుప్వారా, ఫూంచ్ లలో భారత్ ఆర్మీ సైరన్ లు మోగించింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 8 పాక్ మిస్సైల్స్ ను భారత సైన్యం పేల్చేసింది. జమ్మును టార్గెట్ గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. పాకిస్థాన్ మిసైళ్లను S-400 సిస్టమ్ తో భారత సైన్యం ధ్వంసం చేస్తోంది. కాసేపటి క్రితమే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర భారీ పేలుడు సంభవించింది.
పాకిస్థాన్ మిసైల్స్, డ్రోన్లను మధ్యలో భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్స్ సిస్టమ్‌కి దొరకకుండా.. పాకిస్థాన్ డ్రోన్లను ప్రయోగించింది. కానీ భారత్ మాత్రం యాంటీ డ్రోన్ సిస్టమ్ ను దొరకబట్టి S-400 సాయంతో పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ ను కూల్చివేసింది. జమ్ము, కశ్మీర్, పంజాబ్ లోని అమృత్ సర్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు అన్ని బ్లాక్ అవుట్ అయిపోయాయి. ఇటు జమ్ము ఎయిర్ పోర్ట్ నుంచి ఫైటర్ జెట్స్ బయల్దేరాయి. జమ్ము నగరమంతా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి
#BREAKING: Jammu at present is under attack. Drones across the night sky. Blackout has happened across the city. Indian forces neutralising the threat. pic.twitter.com/lvUxq5Opgv
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025