Salman butt On Trophy chor Naqvi : ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో (Women’s Asia Cup 2026 Tournament) టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా మహిళల జట్టుకు ట్రోఫీ దక్కలేదు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేక.. ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది ఉమెన్స్ టీమ్ ఇండియా. అటు బీసీసీఐ ఆదేశాల మేరకు కూడా ట్రోఫీ తీసుకోలేదు. అయితే ఈ అంశంపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీది తప్పు అని కొంతమంది అంటుంటే… కాదు కాదు టీమిండియాదే వందకు రెండు వందల శాతం తప్పని మరికొంతమంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు ( Salman butt On Trophy chor Naqvi) చేశారు. భారతీయులతో బీసీసీఐ గేమ్స్ ఆడుతోందని ఆగ్రహించారు. మొహ్సిన్ నఖ్వీతో బీసీసీఐ పెద్దలు.. షేక్ హాండ్స్, సమావేశాలు చేసుకోవచ్చు… కానీ ట్రోఫీ మాత్రం ఎందుకు తీసుకోరని నిలదీశారు. భారతీయులను పిచ్చోళ్లను చేసేందుకే బీసీసీఐ కుట్రలు చేస్తోంది అంటూ సీరియస్ అయ్యారు సల్మాన్ భట్.
ఆసియా కప్ ప్రెజెంటేషన్ వేడుక ముగిసిన తర్వాత ట్రోఫీ తీసుకోకుండా టీమిండియా వెళ్లిపోవడంపై సల్మాన్ భట్ సీరియస్ అయ్యారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకపోతే… మీకు టైటిల్ ఎలా దక్కుతుంది అంటూ ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం మొహ్సిన్ నఖ్వీ ఇస్తేనే మీరు ట్రోఫీ తీసుకోవాలి.. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు తీసుకుంటానంటే కుదరదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీమిండియా కు టైటిల్ ఇవ్వకుండా మొహ్సిన్ నఖ్వీ వెళ్లిపోవడం కరెక్ట్ అన్నారు. టైటిల్ తీసుకుని వెళ్లిన మొహ్సిన్ నఖ్వీ పై దొంగతనం చేసినట్లు కేసులు పెట్టడం కూడా దుర్మార్గమన్నారు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని పరిశీలించాలని.. తప్పుడు కేసులను నమోదు చేయకూడదని సల్మాన్ భట్ సూచనలు చేశారు.
స్టేడియం వీఐపీ బాక్సులో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా లాంటి ఉన్నతాధికారులు మొహ్సిన్ నఖ్వీ పక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడడం తనకు కనిపించిందన్నారు సల్మాన్ భట్. తెర వెనుక పాకిస్తాన్ వాళ్లతో నవ్వుతూ, సంబరాలు చేసుకోవడం బాగానే ఉంది, మరి ట్రోఫీ తీసుకునేటప్పుడు ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని.. మొహ్సిన్ నఖ్వీ ఆఫీసుకు వెళ్లాలని హర్మన్ ప్రీత్ కౌర్ కు సూచనలు చేశారు. అటు సూర్య కుమార్ యాదవ్ కూడా వెంటనే ట్రోఫీ కలెక్ట్ చేసుకోవాలని వెల్లడించారు. ఇలాగే జాప్యం చేస్తే మళ్లీ ఆసియా కప్ రావడం గ్యారెంటీ అన్నారు. అప్పుడు ఏం చేసినా ట్రోఫీ దక్కుపోదని వ్యాఖ్యానించారు.