E-Paper
Advertisement

Shahid Afridi: పాక్‌, బంగ్లా పోయాయి..వాళ్లు కూడా బైకాట్ చేస్తారు, ఇక చెక్క భ‌జ‌న చేసుకోండి !

Shahid Afridi: పాక్‌, బంగ్లా పోయాయి..వాళ్లు కూడా బైకాట్ చేస్తారు, ఇక చెక్క భ‌జ‌న చేసుకోండి !
Advertisement

Shahid Afridi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్లు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2026 ప్రసారాలు తమ దేశంలో ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదట పాకిస్తాన్ వెళ్లిపోయింది.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ను కూడా వెళ్లగొట్టారు అని ఫైర్ అయ్యారు. త్వరలో మిగిలిన దేశాలు కూడా వెళ్లిపోతాయి.. అప్పుడు మీరే ఐపిఎల్ లో చెక్కభజన చేసుకోండి అంటూ హాట్ కామెంట్స్ చేశాడు షాహిద్ ఆఫ్రీది. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

అందరిని పంపించి మీరే చెక్కభజన చేసుకోండి..? షాహిద్ ఆఫ్రీది సంచలనం

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దానికి నిరసనగా బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హిందువులందరూ ఏకమై, ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బంగ్లా ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడించకూడదని డిమాండ్లు చేశారు.

అయితే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా దిగివచ్చింది. బంగ్లా ప్లేయర్లు ఎవరూ కూడా ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో ఆడకూడదని ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. ఈ ఎఫెక్ట్ ముస్తాఫిజుర్ రహమాన్ పైన పడింది. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది స్పందించారు. ఐపీఎల్ విషయంలో మొదటి నుంచి ఇండియా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్రికెట్ వేరు అలాగే రాజకీయాలు వేరు అని హితువు పలికారు. ఇలా అన్ని దేశాలపై బ్యాన్ విధిస్తూ పోతే, ఐపీఎల్ లో ఇండియా ప్లేయర్లు మాత్రమే ఆడుకోవాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే తమ పాకిస్తాన్ పైన వేటు వేసిన బీసీసీఐ ఇప్పుడు బంగ్లాదేశ్ పై వేయడం దారుణం అంటూ మండిపడ్డారు.

బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై బ్యాన్

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బంగ్లాదేశ్ ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు ఆడకూడదని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రసారాలు తమ దేశంలో ఇకపై ప్రసారం చేయకూడదని.. ఈ మేరకు బ్రాడ్ క్యాస్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ 2026 ప్ర‌సారాలు బంగ్లాలో ఇక‌పై రాబోవు అన్న మాట‌. దీంతో రూ.10వేల కోట్లు బీసీసీఐకి న‌ష్టం జ‌రుగ‌నుంద‌ట‌.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×