Shoaib Akthar On Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక మొనగాడు మహేంద్ర సింగ్ ధోని. 2007లో టి20 ప్రపంచ కప్ అందించిన మహేందర్ సింగ్ ధోని 2011లో వన్డే వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టాడు. ఇక 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akthar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓడిపోతుందన్న భయంతో ధోనీని దెబ్బతీసేందుకు తన కుట్ర చేశానని వివాదాస్పద కామెంట్ చేశారు. పాకిస్తాన్ జట్టును ఓడించే క్రమంలో మహేంద్రసింగ్ ధోని అద్భుతంగా రాణించాడని గుర్తు చేశారు. అందుకే అతని తల పగిలేలా బంతులు విసిరినట్లు షోయబ్ అక్తర్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akthar) షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
2006 సంవత్సరంలో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య వైపక్షిక సిరీస్ జరిగేవి. అయితే అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని టీమిండియాలోకి వచ్చి… అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా 2006 సమయంలో ఫైసలాబాద్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (Pakistan vs. Team India) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని సెంచరీ పూర్తి చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడిని పెవిలియన్ కు పంపేందుకు షోయబ్ అక్తర్ (Shoaib Akthar) తన స్టైల్ లో బౌన్సర్లు సంధించాడు. ఒక్కో బంతి తల పగిలేలా, వచ్చింది. అయినప్పటికీ ఓర్పుతో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ లో ఇరగదీసాడు.
2006లో ఫైసలాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా బౌన్సర్లు సంధించిన షోయబ్ అక్తర్.. తాజాగా జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా తన జట్టు కోసం అలా బౌన్సర్లు అందించాలని… కానీ ధోని అంటే ఆ తర్వాత తనకు గౌరవం పెరిగిందని గుర్తు చేశారు. ధోని లాంటి కెప్టెన్ ఏ జట్టుకు లేడని కితాభించారు. పాకిస్తాన్ లో మహేంద్ర సింగ్ ధోని పుట్టుంటే… ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చేవని షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని (Shoaib Akthar) తన ఆల్ టైం ఫేవరెట్ వికెట్ కీపర్ అంటూ వ్యాఖ్యానించారు. అనవసరంగా గతంలో అతడిని బౌన్సర్లతో వేధించాలని.. ఇప్పుడు ధోనీకి క్షమాపణలు చెబుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.