Virender Sehwag On Bumrah: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా ( Jasprit Bumrah ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యార్కర్లు వేశాడంటే ప్రత్యర్థి బ్యాటర్ల ప్యాంట్లు తడవాల్సిందే. అంతలా భయంకరంగా యార్కర్ల కింగ్ బౌలింగ్ చేస్తాడు. అలాంటి కిరాతకుడు బుమ్రా, చాలా రోజుల నుంచి గాయాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టుకు పదే పదే దూరమవుతున్నాడు. కీలక మ్యాచ్ లలో జట్టుకు దూరమై కొంపముంచుతున్నాడు. అయితే అలాంటి బుమ్రాపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ తో పాటు వన్డేలకు బుమ్రా పనికిరాని పరువు తీశారు. కేవలం టి20 లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని సూచనలు చేశారు.
టీమిండియా స్టార్ ఆటగాడు బుమ్రాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. వరుసగా గాయాల పాలు కావడంపై చాలా సీరియస్ అయ్యారు. ఐపీఎల్ అనగానే అద్భుతంగా ఆడతాడని.. టీమిండియాతో మ్యాచ్ అనగానే ఆసుపత్రి బెడ్ ఎక్కుతాడని పరువు తీశారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఒకడని మరోవైపు ప్రశంసించారు. కానీ ఇటీవల అతనికి తరచూ అవుతున్న గాయాలు ఆందోళన కలిగిస్తున్నట్లు ఫైర్ అయ్యారు. అతను జట్టులో లేనప్పుడు ఇండియా ఆత్మ విశ్వాసం కోల్పోతోందని ఎమోషనల్ అయ్యారు. బౌలర్లు కూడా లయ తప్పి, మ్యాచ్ లను కోల్పోతున్నారని విమర్శలు చేశారు.
దాంతో సాధారణ జట్టు చేతులో కూడా టీమిండియా ఓడిపోవాల్సి అప్పుడప్పుడు వస్తుందని గుర్తు చేశారు. అతని వయసు పెరుగుతోంది కాబట్టి… 2027 వన్డే వరల్డ్ కప్ పైన ప్రధాన దృష్టి సారించాలని కోరారు. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత, టి20 క్రికెట్ మాత్రమే ఆడాలని సూచనలు చేశారు. ప్రతి మ్యాచ్ లో మూడు లేదా నాలుగు ఓవర్ల కోటలు మాత్రమే అతడు వేయాలని.. అప్పుడే జస్ప్రీత్ బుమ్రా గాయాలకు బ్రేక్ పడుతుందని వివరించారు. పని భారం తక్కువగా ఉండే టి20 లలో అతను క్రమం తప్పకుండా అడగగలనని వెల్లడించారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఈవెంట్ లో అతను అద్భుతంగా ఆడతాడన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన అస్త్రం బుమ్కా ఒక్కడేనని.. అతడు కరెక్ట్ గా ఆడితే వరల్డ్ కప్ కూడా రావడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు వీరేంద్ర సెహ్వాగ్.