BigTV English

Shreyas Iyer: ఆడు మగాడ్రా బుజ్జి.. అంబానీ కోటను కూల్చాడు.. ప్రీతి జింటా కోసం ప్రాణం పెట్టాడు

Shreyas Iyer: ఆడు మగాడ్రా బుజ్జి.. అంబానీ కోటను కూల్చాడు.. ప్రీతి జింటా కోసం ప్రాణం పెట్టాడు

Shreyas Iyer:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో వీరోచిత పోరాటం చేసిన శ్రేయస్ అయ్యర్… పంజాబ్ కింగ్స్ జట్టును నేరుగా ఫైనల్ కు తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరడం జరిగింది. ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఢీకొనబోతుంది. జూన్ మూడవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.


Also Read: Rinku Singh Wedding: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న రింకూ సింగ్.. డేట్ ఫిక్స్..ప్రియా సరోజ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

ముఖేష్ అంబానీ కోట బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్లో తిరుగులేని ముంబైని ఇంటికి పంపించాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో రఫ్పాడించాడు శ్రేయస్ అయ్యర్. 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కు నిద్ర లేకుండా చేశాడు. 200కు పైగా ముంబై ఇండియన్స్… స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్ లోను విజయం సాధించేది. ఇప్పటివరకు 18 మ్యాచ్లలో… 200కు పైగా స్కోర్ చేసి… ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కానీ నిన్నటి రోజున 20 ఓవర్లలో 203 పరుగులు చేసిన…. ముంబై ఇండియన్స్ 19వ మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. ఇది కూడా శ్రేయస్ అయ్యర్ కారణంగా ఓడిపోవడం జరిగింది.

నిరాశలో నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ

క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో గెలిచి కచ్చితంగా ఫైనల్ కు చేరతారని ముంబై ఇండియన్స్ అభిమానులు అందరూ అనుకున్నారు. ఫిక్సింగ్ చేసైనా ముంబై ఇండియన్స్ ఫైనల్ కి వెళ్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. దీంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరడంతో… ముంబై అభిమానులు అలాగే ఓనర్లు ఆకాష్, నీతా అంబానీలు నిరాశకు లోనయ్యారు. ఆరవ టైటిల్ గెలవబోతున్నట్లు మొన్న నీతా అంబానీ… సిగ్నల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. ఆమె ఇచ్చిన సిగ్నల్స్కు కౌంటర్ ఇస్తూ శ్రేయస్ అయ్యర్ అయ్యారు… ముంబై ని ఓడించాడు. దీంతో ముంబై ఇండియన్స్ మొత్తం డీలా పడిపోయింది.

ఫుల్ హ్యాపీగా ప్రీతి జింటా

క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోవడం… పంజాబ్ కింగ్స్ విజయం సాధించడంతో… ప్రీతి జింటా ఫుల్ జోష్లో కనిపించారు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ కు గట్టి హగ్ ఇచ్చి మరి… రచ్చ లేపారు ప్రీతిజింటా. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×