Rakul Preet Singh :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అనే సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఈ సినిమాలో “ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ” అనే డైలాగ్ తో అందరి హృదయాలను దోచుకుంది. అమాయకత్వంతో, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించిన రకుల్ కి.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభించాయి.అలా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానినీ తో ఏడడుగులు వేసి, అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ కి గతంలో ఒక పొలిటికల్ లీడర్ హైదరాబాదులో ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సైలెంట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
హైదరాబాదులో రకుల్ కి గిఫ్ట్ గా ఖరీదైన బంగ్లా..
తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ను.. మీపై వచ్చిన అతిపెద్ద వింత రూమర్ ఏంటి? అని ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ..” హైదరాబాదులో నేను ఒక ఇల్లు కొనుగోలు చేశాను. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు ఆ ఇంటిని గిఫ్టుగా ఇచ్చారని రూమర్లు తెగ వైరల్ చేశారు. ఈ విషయం కాస్త మా నాన్నకు తెలియడంతో ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. పెద్ద రచ్చ చేశాడు. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కో రూపాయి పోగు చేసుకుని ఈ ఇల్లు కొన్నాను. కానీ అలాంటి నా ఇంటిపై ఇలాంటి వింత రూమర్లు స్ప్రెడ్ చేయడంతో తట్టుకోలేక పోయాను. అయితే ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మా నాన్నకు నేను ఇదే చెప్పాను. ఇలాంటి చెత్త రూమర్స్ వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. మనం రియాక్ట్ అయితే వాళ్ళు ఇంకా హైలైట్ అవుతారు. సైలెంట్ గా ఉండటమే బెటర్ అని మా నాన్నకి చెప్పి కూల్ చేయించాను” అంటూ రకుల్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే తనకు ఒక పొలిటికల్ లీడర్ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు..
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. ‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత రఫ్, లౌక్యం, పండగ చేసుకో, కరెంట్ తీగ, కిక్ 2, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, సరైనోడు, మన్మధుడు2, చెక్, కొండపొలం వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:HBD Ilayaraja: రైతుబిడ్డ మొదలు మ్యూజిక్ మ్యాస్ట్రో వరకూ.. ఇళయరాజా గురించి తెలియని విషయాలివే!
మా రామన్నకి ఎం సంబంధం లేదు రా బాబు
🤦♂️🤦♂️ pic.twitter.com/fNExbvLSiz— Deva Reddy (@deva_reddy45) June 1, 2025