BigTV English

Zaheer khan about Shreyas Iyer: శ్రేయాస్.. భారీ మూల్యం చెల్లించక తప్పదా..?

Zaheer khan about Shreyas Iyer: శ్రేయాస్.. భారీ మూల్యం చెల్లించక తప్పదా..?

No chance for Shreyas Iyer in Ind Vs England 3rd Test: శ్రేయాస్ అయ్యర్.. మిడిల్ ఆర్డర్ లో ఒక బ్యాటర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న క్రికెటర్.. తను ఫాస్ట్ బౌలింగ్ కన్నా, స్పిన్ బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలడని భావించి టీమ్ మేనేజ్మెంట్ మిడిలార్డర్ లో ఆడిస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఎన్నో అవకాశాలను వరుసగా ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రేయాస్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో  29, 27 పరుగులే చేశాడు.దీంతో మూడో టెస్ట్ లో ప్లేస్ ని క్లిష్టం చేసుకున్నాడు.


ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ శ్రేయాస్ అయ్యర్ ఎంత పనిచేశావ్..? వచ్చిన గొప్ప అవకాశాలను వృథా చేసుకున్నావని అన్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ కి తన ఎంపిక అనుమానమేనని అన్నాడు. తప్పించడానికి టీమ్ మేనేజ్మెంట్ కి ఒక సాకు దొరికిందని అన్నాడు. ఎందుకంటే ఆల్రడీ సర్ఫరాజ్ ఖాన్ ఎదురు చూస్తున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ వచ్చేలా ఉన్నాడని తెలిపాడు.

ఈ క్రమంలో ఎవరిని తీయాలని అంటే, ఫస్ట్ శ్రేయాస్ పేరే వినిపిస్తోందని అన్నాడు. వచ్చిన అవకాశాలను కాలరాసుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్ నలుగురు స్పిన్నర్లతో ఆడుతోంది. ఒక్కరే పేసర్ ఉన్నారు.
అలాంటప్పుడు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శ్రేయాస్ ఇలా అవుట్ కావడం దురదృష్టమైతే, అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఇన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక అదృష్టమని అన్నాడు.


శ్రేయాస్ విషయానికి వస్తే, 2022 డిసెంబర్ లో.. శ్రేయాస్ ఆఫ్ సెంచరీ చేశాడు. తర్వాత మళ్లీ ఇంతవరకు లేదు. మరోవైపు గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి ముప్పు తప్పించుకున్నాడు. మ్యాచ్ లో గిల్ చేతి వేలికి గాయమైంది. మరి అది తీవ్రమైందా? కాదా? అనేది ఇంకా తెలీదు. ఒకవేళ తను తర్వాత టెస్ట్ కి దూరమైతే మాత్రం శ్రేయాస్ లేదా సర్ఫరాజ్ ఖాన్ లకు అవకాశం దక్కుతుంది.

రెండో టెస్ట్ మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కుర్రాళ్లకి ఇంకా అవకాశాలివ్వాలని చెప్పడం కొసమెరుపు. అంటే శ్రేయాస్ కి ఇంకా తలుపులు మూసుకోలేదనేది… దీనర్థమని అంటున్నారు.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×