Big Stories

South Africa Beats India : సఫారీలతో పోరాడి ఓడిన టీమిండియా!

T20c లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది… రోహిత్ సేన. లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ దాకా పోరాడినా… భారత్ కు విజయం దక్కలేదు.

- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు… సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. పేస్ కు అనుకూలించే పిచ్ పై చెలరేగిపోయిన సఫారీ సీమర్లు… స్కోరు 50 పరుగులకు కూడా చేరకముందే… ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లను ఔట్ చేశారు. అందులో లుంగి ఎంగిడికే నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. 19వ ఓవర్ దాకా సఫారీ బౌలర్లను ఎదుర్కొని హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో 68 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 40 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు… సూర్యకుమార్ యాదవ్. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది… టీమిండియా.

- Advertisement -

134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను… భారత బౌలర్లు కూడా బెంబేలెత్తించారు. రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్… తొలిబంతికే డికాక్ ను ఔట్ చేశాడు. మూడో బంతికి… బంగ్లాదేశ్ పై సూపర్ సెంచరీ చేసిన రూసోను కూడా డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. 3 పరుగులకే 2 వికెట్లు పడటంతో… ఆచితూచి ఆడారు… సౌతాఫ్రికా బ్యాటర్లు. ఆరో ఓవర్లో కెప్టెన్ బవుమాను షమి ఔట్ చేశాడు అప్పటికి సౌతాఫ్రికా స్కోరు 24 పరుగులే. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో… మార్ క్రమ్, మిల్లర్ జాగ్రత్తగా ఆడారు. దాంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 40 పరుగులే చేయగలిగింది. భారత్ 10 ఓవర్లలో 60 రన్స్ చేయడం… సౌతాఫ్రికా 40 రన్సే చేయడంతో… విజయంపై భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ… డ్రింక్స్ పూర్తైన వెంటనే 11వ ఓవర్ నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు… మార్ క్రమ్, మిల్లర్. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేశారు. అయినా చివరి ఓవర్ దాకా పట్టువిడవకుండా పోరాడింది… భారత్. చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా… తొలి బంతికి పరుగేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. దాంతో… 4 బంతుల్లో సౌతాఫ్రికా విజయానికి 4 పరుగులు కావాల్సి వచ్చాయి. తర్వాతి రెండు బంతుల్లోని మిల్లర్ ఫోర్లు బాదడంతో… 5 వికెట్ల తేడాతో భారత్ పై నెగ్గింది… సౌతాఫ్రికా. 4 వికెట్లు తీసి భారత్ ను దెబ్బకొట్టిన లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News