BigTV English

Elon Musk : పిట్ట పీల్చేస్తోంది…

Elon Musk : పిట్ట పీల్చేస్తోంది…

Elon Musk : ఏ ముహూర్తాన ట్విట్టర్ ను కొనాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడో గానీ… అప్పటి నుంచి అతనికి అన్నీ ఎదురుదెబ్బలే. ఒకరకంగా చెప్పాలంటే… ట్విట్టర్ పిట్ట… మస్క్ సంపదను పీల్చి పిప్పిచేస్తోంది. ట్విట్టర్ డీల్ కుదిరాక గానీ… దాని వల్ల ఎంత నష్టమో తెలుసుకోలేక పోయిన మస్క్… చివరికి విధిలేని పరిస్థితుల్లోనే ఆ సంస్థను కొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


ట్విట్టర్ ను కొన్నరోజే మస్క్ వ్యక్తి గత సంపదలో 1000 కోట్ల డాలర్లు కరిగిపోయింది. అంటే మన కరెన్సీలో 82 వేల కోట్ల రూపాయలకు పైమాటే. తొలిరోజే మస్క్ సంపద ఈ రేంజ్ లో కరిగిపోవడం చూస్తుంటే… ముందు ముందు మస్క్ కు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చంటున్నారు… విశ్లేషకులు. ట్విట్టర్ ఒక్కో షేరును 54.2 డాలర్లకు కొంటున్నట్లు… దీని కోసం మొత్తం 44 బిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నట్లు మస్క్ ప్రకటించగానే… ఆదాయం పడిపోతున్న సంస్థను ఇంత ధర ఇచ్చి కొనడమా? అని ప్రపంచం నివ్వెరపోయింది. ట్విట్టర్ ను కొనేందుకు అవసరమైన నిధుల్ని… టెస్లా ఈక్విటీలోని తన వాటా షేర్లలో కొన్ని అమ్మేసి సమీకరించబోతున్నారని తెలియగానే… టెస్లా షేర్లూ కుదేలయ్యాయి. ఈ ఏడాది గరిష్ఠ స్థాయితో పోలిస్తే టెస్లా షేర్లు ఇప్పటికీ 35 శాతం దిగువనే ట్రేడవుతున్నాయి. ఈ నష్టాన్ని కూడా కలుపుకుంటే… ఈ ఏడాది మస్క్‌ వ్యక్తిగత సంపద విలువ ఏకంగా 6,600 కోట్ల డాలర్లు కరిగిపోయింది. అంటే… మన కరెన్సీలో దాదాపు 5.4 లక్షల కోట్ల రూపాయల్ని మస్క్ నష్టపోయాడు.

తన సంపద ఏ రేంజ్ లో తుడిచిపెట్టుకుపోబోతోందో తెలిసే… ఏదో ఒక రకంగా ట్విట్టర్ డీల్ ను రద్దు చేసుకోవడానికి మస్క్ విశ్వ ప్రయత్నం చేశాడు. బోగస్ ఖాతాల్ని సాకుగా చూపి… ట్విట్టర్ ను వదిలించుకోవడాని నానా తంటాలూ పడ్డాడు. కానీ… ఒక్కసారి డీల్ కుదిరాక రద్దు చేసుకోవడం కుదరదంటూ ట్విట్టర్ కోర్టుకెక్కి రచ్చ చేయడంతో… విధిలేని పరిస్థితుల్లోనే పిట్టను పట్టుకున్నాడు… మస్క్. అది అతని సంపదను ఇంకా ఏ స్థాయిలో పీల్చేస్తుందో చూడాలి.


Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×