Big Stories

Mettalu : కాలిమెట్టెల సెంటిమెంట్ పాటించాలా?

Mettalu : మన ధర్మాలు,ఆచారాల్లో మంచి ఆలోచన ఉంది. మన శాస్త్ర్లాల్లో సంప్రదాయాల్లో మంచి సిద్ధాంతం ఉంది. వివాహానంతరం యువతి గృహణిగా , ఇంటి ఇల్లాలుగా మారుతుంది. కుమారి స్థానం నుంచి శ్రీమతి అవుతుంది. అర్ధాంగిగా రూపాంతరం చెందుతుంది. తనలోని సగభాగం భర్తకిచ్చి భర్తలోని సగభాగం పొందుతుంది. కుమారిగా తండ్రి ఇంట ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసి నవ్వినా , స్నేహం చేసినా చెల్లిపోతుంది. వివాహిత స్త్రీకి ఎన్నో అడ్డుకట్టలున్నాయి. గృహిణీ ధర్మం కత్తిమీద సాములాంటింది.

- Advertisement -

అందుకే కాలి మెట్టెల ఆచారం
గృహిణికి కాలిమెట్టెలు ఎందుకు, నల్లపూసలు, మంగళసూత్రాలు ఎందుకు ధరించాలని నేటి తరం లెక్కలేనితనంగా ప్రశ్నిస్తుంటుంది. పరపురుషులు తలవంచి చూసినా, తలెత్తి చూసినా ఆమె గృహిణి అని మరొకరకి స్వంతమనీ, ఇంకొకరి అర్ధాంగిగా జీవిస్తోందని తెలియచేయడానికే తెలియచేయడానికే ఈ పద్ధతి పెట్టారు.

- Advertisement -

ఆమెను కామదృష్టితో చూడకూడదని, హాస్యోక్తులు వేయరాదని, గౌరవనీయ దృష్టితో చూడాలని సోదరి భావంతో మసులు కోవాలని పూర్వీకులు గృహిణికి నల్లపూసలు, కాలిమెట్టెలు లాంటి అలంకారాలు ఇచ్చారు.ముఖం చూడగానే నల్లపూసలు, కనిపించాలి, గుండెలు చూడగానే మాంగల్యం కనిపించాలి, చీర అంచులను చూడగానే కాలి మెట్టెలు కనిపించాలి.

2వేల ఏళ్ల నాటి ఆలోచన
పసుపు కుంకుమలు, నుదుట సింధూరం, గాజులు, మంగళసూత్రం, కాలిమెట్టలు వగైరా వంటివి స్త్రీ యొక్క సౌభాగ్యానికి లేదా ఐదవతనానికి గుర్తులు. పర పురుషులు గృహిణిని కామదృష్టితో చూడదలిచినా ఈ వస్తువులు కనిపించగానే వికారం తగ్గిపోతుందనే సంస్కార భావంతో పెద్దలు ఈ పద్ధతిని రూపొందించారు. రెండు వేల సంవత్సరాల క్రితం మనకు మాంగల్యం లేదు. కాలిమెట్టెలు, నల్లపూసలు లేవు. కలియుగ ధర్మం ప్రకారం కలి ప్రభావానికి భయపడి ఈ ఆచారాలను మన పూర్వీకులు కల్పించారు. ఆ ఆలోచనే ఆచారమైంది. నేటి తరంలో ఈ ఆచారాలన్నీ దాదాపు అంతరించిపోతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News