Little hearts Collections : సెప్టెంబర్ 5వ తేదీన బాక్సాఫీస్ వద్ద సినిమా పండుగ మొదలైన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ప్రముఖ సీనియర్ హీరోయిన్ అనుష్క(Anushka ), క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi)దర్శకత్వంలో చేసిన చిత్రం ఘాటీ(Ghaati). ఎన్నో అంచనాల మధ్య పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఈ చిత్రానికి పోటీగా ఏ ఆర్ మురగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా, శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా విడుదలైన చిత్రం మదరాసి. ఈ సినిమా కూడా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు పోటీగా.. #90స్ బయోపిక్ ఫేమ్ మౌళి (Mouli) లీడ్ రోల్ పోషిస్తూ వంశీ నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్.
చిన్న సినిమానే అయినా గట్టి ప్రమోషన్స్ చేసి భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా కంటెంట్ పట్ల నమ్మకం ఉండడంతోనే విడుదలకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు కూడా వేశారు. అదే ఇప్పుడు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రీమియర్ షో ద్వారా సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు కూడా కలెక్షన్లు బాగానే వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకి పాజిటివ్ బజ్ అయితే వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. వాస్తవానికి పెయిడ్ ప్రీమియర్ల నుండి రూ.15 లక్షలకు పైగా గ్రాస్ తో మంచి ఓపెనింగ్ అందుకున్న ఈ సినిమా మౌత్ టాకుతో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పెట్టింది. కానీ వర్క్ అవుట్ కాలేదు. అటు గణేష్ నిమజ్జనం, దీనికి తోడు రెండు బడా చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. అలా మొదటి రోజు ఈ చిత్రానికి రూ.1.3 కోట్లు నెట్, రూ.2.6 కోట్లు గ్రాస్ వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రానికి ఉన్న పాజిటివ్ బజ్ తో ఏకంగా 3నుంచి 4 కోట్లు మొదటి రోజు వసూలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సగానికి సగం కూడా రాబట్ట లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన లిటిల్ హార్ట్స్..
ఇకపోతే పాజిటివ్ బజ్ తో రంగంలోకి దిగిన ఈ సినిమా.. మొదటి రోజు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయకపోయినా.. పెద్ద సినిమాలుగా వచ్చిన ఘాటీ , మదరాసి కంటే కూడా లిటిల్ హార్ట్స్ మూవీకే ఇప్పుడు కలెక్షన్లు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. హీరోగా తొలి ప్రయత్నంలో మౌళి సక్సెస్ అయ్యారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఎలాగో ఈరోజు రేపు వీకెండ్స్ కావడం, పైగా పాజిటివ్ బజ్ కూడా ఉండడం సినిమాకి కలిసొచ్చేలా ఉంది. మరి ఈ వారాంతంలోనైనా కలెక్షన్లు వేగం పుంజుకుంటాయేమో చూడాలి.
ALSO READ:Sobhita: భర్తను కీలుబొమ్మను చేసిన శోభిత.. ఇప్పుడైనా దారికొస్తారా?