UP Murder: ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో సంచలనం సృష్టించిన మహేష్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణమైన హత్య వెనుక మృతుడి భార్య, ఆమె ప్రియుడు ఉన్నారని విచారణలో తేలింది. ఏడాది పాటు సాగిన వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ కేసులో విస్తుపోయే విషయాలను కూడా వెల్లడించారు.
హత్య వెనుక కుట్ర:
మరణించిన మహేష్ కయాముద్దీన్‌పూర్‌లో కూలీగా పనిచేసేవాడు. అతను గత కొంతకాలంగా పంజాబ్‌లోని లూధియానాలో పని చేసి ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి ఇంటికి వచ్చాడు. అతడి భార్య పూజ, స్థానికుడైన జైప్రకాష్ అలియాస్ డంగర్ అనే యువకుడితో గత ఏడాదిగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. జైప్రకాష్ కిండిపూర్ మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్ అమ్మేవాడు. మహేష్ ఇంటికి తిరిగి రావడం వల్ల వీరిద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకోలేక పోయారు.. దీంతో తమ మధ్య అడ్డుగా ఉన్న మహేష్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు.
మద్యం మత్తులో దారుణం:
హత్యకు పథకం పన్నిన జైప్రకాష్ బుధవారం సాయంత్రం మహేష్‌కు మద్యం తాగించాడు. దీంతో కొంత సమయానికే మహేష్ అతిగా మద్యం సేవించి తీవ్ర మత్తులోకి జారుకున్నాడు. మత్తులో ఉన్న మహేష్‌ను ఇంటికి దింపుతానని జైప్రకాష్ వెంట తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కిండిపూర్ మార్కెట్‌లోని ఒక తోట వద్దకు చేరుకున్న తర్వాత, జైప్రకాష్ మహేష్‌ను చెట్టు కింద పడేశాడు. ఆ తర్వాత.. తన ప్రేయసి పూజకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు.
పూజ అక్కడికి చేరుకున్న తర్వాత.. ఆమె కళ్ల ముందే జైప్రకాష్ కత్తితో మహేష్ గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా, పూజ స్వయంగా తన భర్త ఛాతీపై ఇటుకతో పలుమార్లు బలంగా కొట్టి చంపేసింది. ఈ దారుణానికి సంబంధించిన ఆధారాలుగా పోలీసులు కత్తి, ఇటుకను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పోలీసులపై సుత్తితో దాడి చేసి ఖైదీలు పరార్.. ఏపీలో ఘటన!
మొబైల్ ఫోనే నిందితులను పట్టించింది:
గురువారం ఉదయం తోటలో మహేష్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూజ తన భర్త మరణంపై ప్రజల ముందు నాటకం ఆడింది. అయితే.. పూజ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. కాల్ డిటైల్ రికార్డ్స్ (CDR) పరిశీలనలో గత ఆరు నెలలుగా పూజ , జైప్రకాష్ మధ్య తరచుగా మాట్లాడినట్లు గుర్తించారు. ముఖ్యంగా, హత్య జరిగిన రోజు బుధవారం, వీరిద్దరూ 20 సార్లకు పైగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఆధారాలు లభించాయి.
పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. అక్రమ సంబంధంతో అమానుషంగా భర్తను హతమార్చిన ఈ కేసు సుల్తాన్‌పూర్‌లో చర్చనీయాంశంగా మారింది.