BigTV English

Ghaati Collections : అనుష్క గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా.. ఏంటీ ఈ కలెక్షన్లు ?

Ghaati Collections : అనుష్క గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా.. ఏంటీ ఈ కలెక్షన్లు ?

Ghaati Collections : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ గా నటించిన చిత్రం ఘాటీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాలాకాలం తర్వాత అనుష్క చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో తోనే ఒకచోట పాజిటివ్ టాక్ ని అందుకుంటే.. మరో చోట యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. టాక్ ఎలా ఉన్నా సరే కలెక్షన్లు మాత్రం పర్వాలేదని తెలుస్తుంది. అయితే ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


“ఘాటీ” ఫస్ట్ డే కలెక్షన్స్.. 

అనుష్క శెట్టి గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈమె ప్రత్యేకమైన స్టోరీ తో ఘాటీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది అనుష్క శెట్టి. ఓ గిరిజన యువతి పాత్రలో నటించిన ఆమె ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే అనుకున్న టాక్ని మూవీ సొంతం చేసుకోలేదు. మొదటిరోజు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించినా కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ‘ఘాటీ’ సినిమాకు అటు ఇటుగా రెండు కోట్ల రూపాయలకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళంలో ఈ సినిమాకు ఆశించిన స్పందన లేదట. అక్కడ నుంచి చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు.. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కలెక్షన్లు అయితే రాలేదని తెలుస్తుంది. ఇక ఈ వీకెండు ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..

Also Read :


స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ క్రిష్ డైరెక్షన్, యువి క్రియేషన్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వాల్యూలకి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించాయని చెప్పవచ్చు. రిలీజ్ కి ముందు భారీ అంచనాలు క్రియేట్ అయినా సరే రిలీజ్ అయిన తర్వాత అంత బజ్ రాలేదని చెప్పాలి. హీరో ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు నటించారు. జగపతి బాబు, రాజు సుందరం, జాన్ విజయ్, జిష్షు సేన్ గుప్తా, లారిస్సా బోనేసి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టోరీ విషయానికొస్తే.. ఓడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కుందల నాయుడు, కాష్టాల నాయుడు తమ కనుసైగల్లో శాసిస్తు ఉంటారు. అలాగే ఆ ప్రాంతంలోనే శీలావతి కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూ.. వైద్య వృత్తిలో ఉన్న దేశీ రాజును ప్రేమిస్తుంది. గంజాయి ముఠాల్లోకి శీలావతి ఎలా ప్రవేశించింది. బిజినెస్‌కు అడ్డంకి మారిన శీలావతిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? అనుష్కకు జరిగిన అన్యాయం గురించి ఆమె ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నది అన్నది ఈ సినిమా స్టోరీ. ఏదో కొత్త మెసేజ్ ఇవ్వాలని క్రిష్ అనుకున్న కూడా అది కాస్త బెడిసి కొట్టిందని తెలుస్తుంది.. ఇక ఈ వీకెండ్ అన్న ఈ సినిమా కలెక్షన్లు కాస్త మెరుగుపడతాయేమో చూడాలి..

Related News

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×