Pumpkin Seeds: గుమ్మడి గింజలు అంటే సాధారణంగా వీటిని పెపిటాస్ అని పిలిచే విత్తనాలు, ఇవి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. చిన్న విత్తనాలు అయినా, వీటిలో మెగ్నీషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్, వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న గింజలు మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని సాధారణంగా వంటలో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తాం. కానీ వీటిని కేవలం రుచికి మాత్రమే కాదు, మంచి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్ నివారణకు సహకరింస్తుంది
గుమ్మడి గింజలు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన ప్రొటీన్స్ నిండుగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న చిన్న భాగాలను సైతం పనిచేసే విధంగా ఉపయోగ పడుతుంది. అంతేకాదు దీనిని రోజూ తినడం వలన అనేక సమస్యలను నివారిస్తుంది. ఇవి తినడం వలన గుండె ఆరోగ్యానికి మెరుగు పరిచేలా చేస్తాయి. షుగర్ నివారణకు సహకరింస్తుంది. చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతాయి. అంతేకాదు దీనిని రాత్రి పూట తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
విటమిన్ ఈ
గుమ్మడి గింజల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో శక్తివంతం అవుతుంది. ఫ్రీ రాడికల్స్‌ని అంటే శరీరంలో కణాలలో జరిగే జీవ క్రియలను నిరోధించడం, శరీరాన్ని రక్షించడం, రోగనిరోధక వ్యవస్తను బలపరుస్తాయి.
జీర్ణక్రియకు గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. అందులోని ఫైబర్ పొట్టలోని సమస్యలను తగ్గిస్తూ, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ప్రతి రోజు కాస్తా గుమ్మడి గింజలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది, శరీరంలో అవసరమైన పోషకాలు సులభంగా గుర్తించి వాటిని సరైన ప్రక్రియలో మారుస్తుంది.
Also Read: Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?
మదుమేహ సమస్యకు చెక్
మధుమేహ సమస్యలున్న వారికి కూడా గుమ్మడి గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. క్రమంగా, చిన్న మోతాదులో ఈ గింజలను ఆహారంలో చేర్చడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని ఇస్తూ, మనసుకు ప్రశాంతత ఇస్తూ, అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
ప్రతిరోజు వీటిని తింటే మంచి ఫలితాలు
వీటిని సరైన పద్దతి ద్వారా తీసుకోవాలి. ప్రతిరోజూ 2–3 చపాతీల కొద్దిగా గుమ్మడి గింజలను నెమ్మదిగా తినడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని వేయించి తినడం అవసరం లేదు, ఎందుకంటే వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్రమంగా నాశనం చేసే శక్తి ఉంటుంది. ఉదయం లేవగానే బ్రెష్ చేసిన తరువాత ఖాళీ కడుపుతో వీటిని తినడం నీరసంగా వున్న శరీరాన్ని కాసేట్లోనే మంచి శక్తిని ఇస్తూ, పేగుల పనితీరును ప్రారంభించే విధంగా చేస్తుంది.
గుమ్మడి గింజల ఫ్రూట్ సలాడ్
దీని రుచిని బట్టి కూడా చాలా మంది గుమ్మడి గింజలు వాడుతారు. మీరు వీటిని పుదీనా, తేనె, ఫ్రూట్ సలాడ్ లేదా ద్రాక్ష వంటి ఇతర పదార్థాలతో కలిపి తింటే రుచి కూడా పెరుగుతుంది. క్రమంగా, రోజువారీ ఆహారంలో కూడ చేర్చు తింటూ ఉంటే శక్తి పెరగడం, చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, మానసిక ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.
చిన్నారులకు గుమ్మడి గింజల స్నాక్స్
గుమ్మడి గింజలు చిన్న పిల్లలకు ఉడికించి వాటి నీటిని తాగించినా పిల్లలకు బలంగా పనిచేస్తుంది. అంతే కాదు పిల్లలకు ఇచ్చే ఆహారంలో కూడా గుమ్మడి గింజలను చేర్చితే ఆరోజు అంతా ఉల్లాసంగా ఉంటారు. అంతేకాదు గుమ్మడి గింజలను పిల్లలకు వేయించి వాటిలో కాస్త ఉప్పు, కారం చేర్చి తినిపించినా మంచి స్నాక్స్ లా ఉపయోగపడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, సరిగ్గా ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం, శక్తి, జీవన శైలి మొత్తం మారవచ్చు.