BigTV English

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Sandeep Reddy Vanga: దానికి మించిన  ఇంటర్వెల్  సీన్ ఇంకేదీ లేదు

Sandeep Reddy Vanga: ఎంత పెద్ద స్టార్ అయినా వారు అభిమానించే హీరోలు ఉంటారు. వారికి నచ్చిన సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద తోపు  డైరెక్టర్స్ కు కూడా అభిమాన హీరోలు, డైరెక్టర్స్ ఉంటాయి.  వేరే డైరెక్టర్స్ తీసిన సినిమాలు చూసి అడ్మయిర్ అవుతూ ఉంటారు కూడా.  స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా..కొన్ని సినిమాలు చూసి ఆశ్చర్యపోయానని, ఒక సినిమా చూసి ఎడిటింగ్ నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.


సీనియర్  నటుడు జగపతి బాబు.. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. జయమ్ము నిశ్చయమ్మురా అనే షోకు జగపతి బాబు హోస్ట్ గా మారాడు. ఇప్పటికే ముగ్గురు స్టార్ సెలబ్రిటీలను ఈ షోకు పిలిచి అద్భుతమైన ప్రశ్నలు అడిగి అలరించాడు. అక్కినేని నాగార్జున, శ్రీలీల, నాని.. ఈ షోకు గెస్ట్ లుగా విచ్చేసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇక నాలుగో ఎపిసోడ్ కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగాను ఆహ్వానించాడు.

Pawan Kalyan: ఓజీ ప్రమోషన్స్.. పవన్ అవసరం లేదు ?


ఇక ఈ ఎపిసోడ్ లో వీరి ముగ్గురు మధ్య ఫన్ నెక్స్ట్ లెవెల్ అని చెపుచ్చు. ముఖ్యంగా వర్మ పంచ్ లు అయితే వేరే లెవెల్. ఇక ఈ షోలో వంగా.. తనకు బాగా నచ్చిన ఇంటర్వెల్ సీన్ బాహుబలి 2 లోనిదని, దాన్ని మించిన ఇంటర్వెల్ ఇంకేదీ లేదని చెప్పుకొచ్చాడు. ” నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ హైలైట్ అని చెప్తాను. దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇప్పటివరకు రాలేదు. ఆ సినిమా చూసాక.. నేను అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ చూసుకున్నాను. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా.. లేదా.. అని ఒక్క నిమిషం భయం వేసింది.  సినిమాకు ఇంటర్వెల్ కూడా గొప్పగా ఉండాలని రాజమౌళి నిరూపించాడు. ఇక అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసాక నాకు దైర్యం వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.

ఇక వర్మ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని, గాయం సినిమా కేవలం వర్మ కోసమే చూశానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమాను 60, 70 సార్లు చూశానని, అది చూసే ఎడిటింగ్ నేర్చుకున్నట్లు  తెలిపాడు. ప్రస్తుతం సందీప్ వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం వంగా.. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ – వంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Related News

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Big Stories

×