Pawan Kalyan: ప్రస్తుతం ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ ఎంత ముఖ్యమో.. ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. సినిమా చేసేశాను.. నా పని అయ్యిపోయింది అనుకుంటే అవ్వదు. అందులో నటించినవారు కచ్చితంగా ప్రమోషన్స్ లో కూడా కనిపించాలి. అలా అయితేనే ప్రేక్షకులు థియేటర్ వైపు చూస్తారు. అలా ప్రమోషన్స్ లేకపోవడం వలన స్టార్ ల సినిమాలే బోల్తాపడ్డాయి. ఆ సినిమాలు ఏంటి అనేవి ప్రేక్షకులకే బాగా తెలుసు.
ఇక ఇప్పుడు అందరి చూపు ఓజీపైనే ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అందరి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న.. పవన్ ప్రమోషన్స్ కి వస్తాడా.. ? అదేంటి ఆయన సినిమా ప్రమోషన్స్ కు ఆయన రాకపోతే ఎలా.. ? అంటే. అసలు ఆయన రావాల్సిన అవసర లేదు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
ఓజీ సినిమా మొదలైనప్పటి నుంచి సుజీత్ సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉన్నాడు. సెట్ లో ఉన్న ఫొటోలకే బ్యానర్లు పెట్టేలా చేశాడు. ఇక ప్రతి అప్డేట్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వచ్చాడు. ఇంకోపక్క డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అడ్మిన్స్ అయితే.. ఎప్పటి నుంచో డ్యూటీ చేస్తున్నారు. ఎక్కడ ఓజీ అన్న పేరు వినిపించినా.. వెనుక నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా బీజీఎమ్ వేసి వీడియోలను ట్రెండింగ్ లోకి మార్చేస్తున్నారు.
Siddu Jonnalagadda: డీజే టిల్లు.. మగజాతి ఆణిముత్యంగా మారుతున్నాడా ?
ఇక ఓజీ నుంచి అప్డేట్ వస్తే ఆరోజు సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. అలా ఓజీకి రావాల్సిన మొత్తం హైప్ ఎప్పుడో వచ్చేసింది. ఇక టీజర్, సాంగ్స్ అంటూ మేకర్స్ ఎప్పటికప్పుడు ఆ హైప్ ను పెంచుతూనే ఉన్నారు.ఈ లెక్కన ప్రమోషన్స్ కు పవన్ రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. హా.. అదేంటీ.. హరిహర వీరమల్లుకు పవన్ ప్రమోషన్స్ చేశాడు కదా.. ఓజీకి కూడా వస్తాడు అనుకుంటే.. అది ఇంకా బోనస్ అని చెప్పుకోవచ్చు.
వీరమల్లు ఎప్పటి నుంచో నానుతున్న సినిమా. అస్సలు హోప్స్ లేని సినిమా. ఆ సమయంలో పవన్ కూడా రాకపోతే వీరమల్లు ఒక్కరోజు కన్నా ఎక్కువ థియేటర్ లో నిలిచేది కాదు. అందుకే పవన్ గట్టిగా ఆలోచించి.. తన పనులను పక్కన పెట్టి మరీ ప్రమోషన్స్ చేశాడు. ఓజీ విషయంలో అంత టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది.. సినిమాపై అంచనాలు ఆకాశానికి ఉన్నాయి. పవన్ రాకపోయినా సుజీత్ మ్యానేజ్ చేసేస్తాడు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ రాకుండా వదిలేస్తాడా.. ? వీరమల్లుకు చేసినట్లే ఓజీకి కూడా ప్రమోషన్స్ చేస్తాడా.. ? అనేది చూడాలి.