Donald Trump: మోడీ దెబ్బ.. ట్రంప్ అబ్బా..! ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న డైలాగ్. ఇక డైలాగ్ మాట ప్రక్కన పెడితే వాస్తవంగా ఇప్పుడు జరిగింది కూడా ఇదే. ఇన్నాళ్లు టారిఫ్‌లతో భారత్‌పై రంకెలు వేస్తున్న ట్రంప్.. మోడీ దెబ్బకు అమాంతం దిగొచ్చారు.
మోడీ గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ కితాబు..
ఏకంగా మోడీ తన ఫ్రెండ్ అంటూ ప్రపంచం ఎదుట చెబుతున్నారు. అంతేకాదు.. మోడీ గొప్ప ప్రధాని అంటూ కితాబు ఇచ్చారు. భారత్‌తో సంబంధాలపై ట్రూత్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసి.. అందరినీ అశ్చర్యానికి గురిచేశారు పెద్దన్న.
అమెరికాకు భారత్ దూరమైందని ట్రంప్ ఆవేదన..
అమెరికాకు భారత్ దూరమైంది అంటూ గోడువెల్లబోసుకుంటున్నారు ట్రంప్. రష్యాతో చమురు కొనుగోలు తనను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. అయితే రష్యాతో చమురు కొనొద్దని మాత్రమే చెప్పాను.., అయినా భారత్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. అందుకే భారత్‌పై 50శాతం సుంకాలు విధించానంటూ వివరణ ఇచ్చుకున్నారు ట్రంప్.
ఇప్పుడు భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధం- ట్రంప్
వాస్తవానికి చైనాలో జరిగిన SCO సదస్సు తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. ఒకే వేదికపై జిన్‌పింగ్, పుతిన్, మోడీ కలుసుకున్నారు. అప్యాయంగా మాట్లాడుకున్నారు. అంతేకాదు.. డాలర్ లేని ఆర్థిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు జిన్‌పింగ్ ప్రకటించారు. దీంతో ఒకింత షాక్ గురయ్యాడు ట్రంప్. ఇంకేముంది కాస్త వెనక్కి తగ్గాడు. తర్వాత పుతిన్, మోడీ ఒకే కారులో ప్రయాణించడం చూసి మరింత దిగొచ్చాడు.
రష్యా, చైనాలతో భారత్ దోస్తీపై అక్కసు..
ప్రధాని మోదీ చాలా గొప్పవాడు అని చెప్పాడు. కానీ, చైనాతో భారత్ రష్యా జత కట్టడం మంచి పద్ధతి కాదని ట్రంప్ తెలిపారు. చైనాను నమ్మోద్దంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: బాలాపూర్ లడ్డూకు రికార్డ్ ధర.. ఎవరు దక్కించుకున్నారంటే..?
భారత్-అమెరికా సంబంధాలపై ఆందోళన వొద్దు-ట్రంప్
మొత్తానికి ఏదైతేనేం మోడీ దెబ్బకు ట్రంప్ విలవిలలాడాడు. అందరూ కలిసి తనును ఒంటరిని చేస్తారేమోనని భయపడ్డాడు. అనుకున్నదే తడువుగా భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకున్నాడు. భారత్- అమెరికా సంబంధాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ
తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. భారత్-అమెరికా మధ్య భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ వేదికగా ప్రకటించారు మోడీ. మొత్తానికి చేతులు కాలక కాళ్లు పట్టుకున్నారు ట్రంప్.