Sobhita: పేరుకే తెలుగమ్మాయి.. కానీ వివాహం జరగకముందు బాలీవుడ్, హాలీవుడ్ అంటూ వరుస చిత్రాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి తప్ప ఈమె గురించి సౌత్ లో పెద్దగా ప్రస్తావన వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే. అలాంటి ఈమె ఎప్పుడైతే అక్కినేని వారసుడితో ప్రేమలో పడిందో ఇకప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.. నాగచైతన్య (Naga Chaitanya) ఎంతో ఇష్టం పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత(Samantha)ను దూరం చేసుకున్న తర్వాత 2022లో శోభిత(Sobhita Dhulipala) తో ప్రేమలో పడ్డారట. ఇక పలుమార్లు పలు రెస్టారెంట్లో దర్శనమిచ్చి.. ఆ వార్తలను కొట్టి పారేసిన ఈ జంట ఎట్టకేలకు 2024 నవంబర్లో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
భార్య సలహాలు పాటిస్తున్న చైతూ..
ఇకపోతే పెళ్లయిందో లేదో అప్పుడే భర్తను కంట్రోల్ చేస్తోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు నాగచైతన్య చేసిన కామెంట్లు వింటుంటే నిజంగానే నాగచైతన్య శోభిత చేతిలో కీలుబొమ్మల మారిపోయాడు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది కనీసం ఇప్పుడైనా దారికి వస్తాడా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఇకపై అలాంటి చిత్రాలే చేస్తానంటున్న చైతూ..
ప్రస్తుతం వివాహం తర్వాత ఇటు నాగచైతన్య, అటు శోభిత ఇద్దరూ ఎవరికి వారు సినిమాలలో బిజీ అయిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. “నేను ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు చేయడం లేదు. ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింద. అందుకే యాక్షన్ సినిమాలు చేయాలి అని నా భార్య శోభిత నాకు సలహా ఇచ్చింది. వాస్తవానికి ఆమె సలహాలు ఎప్పుడూ బాగుంటాయి. ఆమె ఒక ప్రేక్షకురాలిగా సినిమాను చూసి ఎలా ఉండాలో జెన్యూన్ గా చెబుతుంది. అందుకే ఆమె మాటనే ఇప్పుడు ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అందులో భాగంగానే లవ్ స్టోరీ మూవీస్ కాకుండా ఆక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలని ఫిక్స్ అయ్యాను” అంటూ నాగ చైతన్య కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోనే ఇలాంటి కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఇకపోతే నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో చాలామంది శోభితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక భర్తను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆమె చేస్తున్న ప్రయత్నానికి నిజంగా హాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈమధ్య ఒక మోస్తారుగా లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నా.. యాక్షన్ చిత్రాలకే పెద్ద పీట వేస్తున్నారు ఆడియన్స్. దానిని దృష్టిలో పెట్టుకొని శోభిత ఈ సలహా ఇవ్వడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. మరి కనీసం తన భార్య సలహాతో నైనా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య ఈ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.
ALSO READ:Bollywood: దానికంటే ప్రెగ్నెన్సీ సులభం.. హాట్ బాంబు పేల్చిన నటుడి భార్య!