Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) వైభవ్ సూర్య వంశీ పేరు మారుమోగుతోంది. ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. ఇక నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన 300 స్ట్రైక్ గ్రేడ్ తో చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ ( vaibhav Sooryavanshi ) 15 సంవత్సరాలు కాదని మరోసారి వెల్లడించారు. ఏజ్ విషయంలో డ్రామాలు వాడుతున్నాడని ఆగ్రహించారు. ఇక ఇండియాలో బౌండరీ గేట్లు చాలా చిన్నగా ఉంటాయని.. అందుకే వైభవ్ సూర్య వంశీ అవలీలగా సిక్సులు కొడుతున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్.
Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవతల పడాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ సందర్భంగా వైభవ్ సూర్య వంశీ మరోసారి తన విలయ తాండవం చేశాడు. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. ఇందులో 7 సిక్సులు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 300 స్ట్రైక్ రేట్ తో ఇరగదీసాడు వైభవ్. ఈ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తు అయింది. అయితే వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కట్టడం మొదలు పెడుతున్నారు.
తాజాగా ఇదే వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్ పైన తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాలో బౌండరీ గేట్స్ చాలా చిన్నగా ఉంటాయని.. అందుకే వైభవ్ సూర్య వంశీ సులభంగా సిక్సర్లు కొడుతున్నాడని బాంబు పేల్చారు. 30 నుంచి 40 మీటర్లు మాత్రమే బౌండరీ గేట్లు ఉండటం కారణంగా వైభవ్ సూర్య వంశీ మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొడుతున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ లో బౌండరీ గేట్లు చాలా పెద్దగా ఉంటాయని.. తమ దగ్గర వైభవ్ ఆటలు సాగబోవు అని వెల్లడించారు. ముందుగా వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు అంటూ నాటకాలు వాడుతున్నాడని ఆగ్రహించారు. వాస్తవంగా అతని వయసు 21 నుంచి 25 మధ్యలో ఉంటుందని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్. అయితే, తన్వీర్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంట్ ఇస్తున్నారు. వైభవ్ లాంటి ప్లేయర్ తమకు లేడని, ఇలా తన్వీర్ అహ్మద్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగరేట్ తాగి, నడిరోడ్డుపైనే..ఏం బతుకురా నీది
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==