E-Paper
Advertisement

అంపైర్ల‌ను కొనుగోలు చేసి, పాకిస్తాన్ ను ఓడించారు..త‌న్వీర్ ఆరోప‌ణ‌లు!

అంపైర్ల‌ను కొనుగోలు చేసి, పాకిస్తాన్ ను ఓడించారు..త‌న్వీర్ ఆరోప‌ణ‌లు!
Advertisement

Tanveer Ahmed On Indian Royals Vs Pakistan Panthers:  ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ (Asian Legends League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ పాంథ‌ర్స్ వర్సెస్ ఇండియన్ రాయల్స్ (Indian Royals Vs Pakistan Panthers) మధ్య ఆదివారం సూపర్ మ్యాచ్ జరిగింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో… ఇండియన్ రాయల్స్ అద్భుతంగా రానించి విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టును రెండు వికెట్ల తేడాతో ఓడించి ఇండియన్ రాయల్స్ టీం విజేతగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా విజయం పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) మరోసారి విషం కక్కాడు. అంపైర్లను కొనుగోలు చేసి పాకిస్తాన్ పాంథ‌ర్స్ ను ఓడించారని.. టీమిండి ఆడింది మొత్తం తొండాట అంటూ బాంబు పేల్చారు. లేకపోతే టీమిండియా అసలు గెలిచేది కాదంటూ విమర్శలు చేశారు. దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

ఇండియ‌న్ రాయ‌ల్స్ చేతిలో చిత్తుగా పాకిస్తాన్ పాంథ‌ర్స్‌

Advertisement

ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియన్ రాయల్స్ వర్సెస్ పాకిస్తాన్ పాంథర్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో పాకిస్తాన్ పాంథర్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లు ఆడిన పాకిస్తాన్.. ఆర్ వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఇమ్రాన్ నజీర్ 47 పరుగులు చేయగా… ఇబ్రార్ 39 పరుగులతో రాణించాడు.

ఉమర్ 39 పరుగులు చేయగా యాషీర్ పది పరుగులు చేశారు. అటు టీమిండియా బౌలర్లలో సుభోద్, షాదాబ్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక 168 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇండియన్ రాయల్స్ అద్భుతంగా రాణించింది. 17.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి… లక్ష్యాన్ని చేదించింది ఇండియన్ రాయల్స్. రిషి ధావన్ 50 పరుగులు చేయగా.. కన్వర్ 46 పరుగులతో రెచ్చిపోయాడు. మరో ఆటగాడు అభిషేక్ 30 పరుగులు చేయగా చివరలో అనురీత్ సింగ్ 16 పరుగులతో రాణించాడు. దీంతో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా విక్టరీ సాధించింది.

అంపైర్ల‌ను కొనుగోలు చేసి, పాకిస్తాన్ ను ఓడించారు..త‌న్వీర్ ఆరోప‌ణ‌లు!

Advertisement

పాకిస్తాన్ పాంథర్స్ జట్టు పైన ఇండియన్ రాయల్స్ విజయం సాధించడం పట్ల తన్వీర్ అహ్మద్ విషం కక్కాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పాకిస్తాన్ జట్టును ఇండియా ఓడించిందని ఆరోపణలు చేశారు. ఎంపైర్లు అందరూ.. టీమిండియా ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయారని బాంబు పేల్చారు. లేకపోతే అసలు ఇండియా గెలిచే సమస్య లేదని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుందని… డబ్బులు పోసి మరి పాకిస్తాన్ ను ఓడించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఓడిపోయిన ప్రతిసారి ఇలాగే తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.

 

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

 

 

Related News

రాంచీలో చిల్ అవుతోన్న ధోని, రిష‌బ్ పంత్..కారులో షికార్లు కొడుతూ

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా సుల‌భంగా మైదానాలు కేటాయించారు !

రిటైర్మెంట్ ప్లేయ‌ర్ల‌ను దొంగ‌ల్లా చూస్తున్నారు…బీసీసీఐపై మైఖేల్ వాన్ సీరియ‌స్‌

పాకిస్తాన్ జ‌ట్టును సంక‌నాకిస్తున్నాడు..న‌ఖ్వీ త‌ప్పుకుంటేనే, నేను ఛార్జ్ తీసుకుంటా

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే

దున్న‌పోతుల్లా తిన‌డం కాదు, పాకిస్తాన్ జెండా ఎగుర‌వేయ‌డం నేర్చుకో ?

Big Stories

Advertisement
×