E-Paper
Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్
Advertisement

IND VS AFG : టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన టి20 సిరీస్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే, టీమిండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్ అయింది. ఇప్పటికే, రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించిన టీమిండియా… మూడవ టి20 లోనూ అదే జోరు కొనసాగించింది. దీంతో, 3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై సిరీస్ కైవసం చేసుకుని టీమిండియా.

టీమిండియా దెబ్బ అదుర్స్… ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్

టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య గురువారం రోజున చిట్ట చివరి టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక జరిగింది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా నే మొదట బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మతోపాటు సంజు శాంసన్ మెరుపులు మెరిపించారు. 30 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ చేయగా…. సంజు శాంసన్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్స్ ఆడిన టీమిండియా, 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. అయితే టీమిండియా విధించిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఎప్పటి లాగే తేలిపోయింది ఆఫ్గనిస్తాన్. కేవలం 15 ఓవర్లు ఆడిన ఆఫ్ఘనిస్తాన్, 94 పరుగులు చేసి, కుప్పకూలింది. ఈ క్రమంలో 127 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది అయ్యర్ సేన. ఈ విజయంతో మూడు టి20 సిరీస్ ను అవలీలగా దక్కించుకుంది టీమిండియా.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు 50 కోట్ల లాభం

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య టీ20 సిరీస్ కారణంగా బీసీసీఐకి ఒక్క రూపాయి రాలేదు. కానీ, ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం రూ.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆథిత్య జట్టుగా ఆఫ్ఘానిస్తాన్ ఉన్న తరుణంలో మీడియా రైట్స్, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ప్రత్యర్థి ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అంటే బీసీసీఐకి ఒక్క రూపాయి కూడా రాదన్న మాట. ట్రోఫీ తప్ప, ఏం మిగలబోదని చెప్పొచ్చు.

అభిషేక్ “ఓం నమః శివాయ” సెల‌బ్రేష‌న్ ర‌హ‌స్యం ఇదే

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా 30 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ… ఎన్నడూ లేని విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. హెల్మెట్ తో పాటు గ్లౌజ్ తొలగించి.. మైదానం మధ్యలో కూర్చున్నాడు. ఓం నమః శివాయ అని జపం చేసి.. ఆ తర్వాత సంజు శాంసన్ కు హగ్ ఇచ్చాడు. దీంతో అభిషేక్ శర్మ సెలబ్రేషన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది.

అయితే దీని వెనుక యువరాజ్ సింగ్ ఉన్నాడట. అభిషేక్ శర్మకు యువరాజ సింగ్ గురువు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ శర్మ సరిగ్గా బ్యాట్ జులిపించడం లేదు. ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ తో పాటు, ఆత్మవిశ్వాసం పెరిగేలా… ఓం నమః శివాయ జపం చేయించాడట యువరాజ్. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ కూడా దాన్ని ఫాలో అయి… సెంచరీ చేసిన తర్వాత గ్రౌండ్ లోనే అదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

 

 

Related News

ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

కొంపముంచిన స్మృతి వ్యవహారం.. పృథ్వీ షాతో కాబోయే భార్య బ్రేకప్

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

Big Stories

Advertisement
×