Illu illaalu Pillalu Dheeraj : ఇటీవల కాలంలో సినిమాలకు ఉన్న డిమాండ్ కన్నా సీరియల్స్ ఉన్న ఎక్కువే.. గత కొన్నేళ్లుగా సీరియల్స్ కి మంచి స్టోరీలు కూడా రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ స్టోరీలో చాలా కొత్తగా ఉండడంతో.. ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ అని చూసేందుకు ఆసక్తి కనపరుస్తూ వస్తున్నారు. అటు చానల్స్ కూడా పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని ప్రచారం చేయడంతో ఎక్కువ మంది వీటిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇకపోతే ఇటీవల కాలంలో ఎక్కువ మంది సీరియల్స్ కే మొగ్గు చూపిస్తున్నాడంతో మేకర్స్ కూడా ప్రేక్షకులను ఉత్కంఠతో ఎదురుచూసేలా స్టోరీలను తెరకెక్కిస్తున్నారు. ఓకే నా స్టార్ మా లో ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సీరియస్లలో నటించే నటీనటుల గురించి తెలుసుకునేందుకు నిటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ధీరజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సీరియల్ కి ధీరజ్ గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి అంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..
తెలుగు బుల్లితెరా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల కాలంలో ఇక్కడ వచ్చే ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న విషయం చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్టోరీ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో హీరో పాత్రలో నటిస్తున్న ధీరజ్ గురించి ప్రేమ గురించి ఈ మధ్య రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ధీరజ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం మరొక చానల్లో సీరియల్లో కనిపించడమే అని తెలుస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ సీరియల్ లో కొనసాగుతూనే మరో సీరియల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కష్టం కదా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. భారీ క్రేజ్ వచ్చిన ఆ సీరియల్ ని వదులుకునే పరిస్థితిలో ధీరజ్ అయితే లేడని తెలుస్తుంది. మరి సోషల్ మీడియాలో గతంలో కూడా ఇలానే ధీరజ్ సీరియల్ కి గుడ్ బై చెప్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలు వినిపించడంతో ఇందులో నిజం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న ధీరజ్ కున్న క్రియేటివ్ మామూలుగా లేదు సోషల్ మీడియాలో ఇతనికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరో ధీరజ్ తెలుగులో అనేక సీరియల్ లో నటించారు.. కన్నడ యాక్టర్ నితిన్ అద్వి తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన మొదటగా స్టార్ మా లో ప్రసారం అయిన కుంకుమపువ్వు సీరియల్లో నటించారు.. ఈ సీరియల్ స్టార్ మా లో సూపర్ హిట్ అవడంతో నితిన్ కు అవకాశలు వరుసగా వచ్చి పలకరించాయి. దాంతో ఈ హీరోకి వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో క్రేజ్కూడా భారీగా పెరిగింది.. ఇకపోతే ఈ హీరో కి రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఒక్కరోజుకి దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. లెక్కన చూస్తే నితిన్ నెలకి లక్షలని సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు.