Abhishek Sharma Century Celebration: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టి20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా, 3-0 తేడాతో ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. మొదటి మ్యాచ్ లోనే సెంచరీ మిస్ చేసుకున్న అభిషేక్ శర్మ, రెండు మ్యాచ్ లో అర్థ సెంచరీ జస్ట్ లో పోయింది. కానీ మూడవ టి20లో మాత్రం 30 బంతుల్లోనే సెంచరీ చేసి ఇరగదీసాడు. సెంచరీ చేసిన తర్వాత ఓం నమః శివాయ అనే సెలబ్రేషన్స్ (Abhishek Sharma century celebration) చేసుకున్న అభిషేక్ శర్మ, వివాదంలో చిక్కుకున్నాడు. ఇదే అదురుగా తీసుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) రెచ్చిపోయాడు. మైదానంలో మత ప్రచారం చేస్తారా? అంటూ నిలదీశారు. వెంటనే అభిషేక్ శర్మ పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు.
టీమ్ ఇండియా యంగ్ కుర్రాడు అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన మూడవ టి20 లో ఇరగదీసాడు. 30 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్ తో సెంచరీస్ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత ఓం నమః శివాయ అంటూ మైదానంలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అభిషేక్ శర్మ. అయితే ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. మైదానంలో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశంపై ఇంజమాం కూడా చాలా సీరియస్ అయ్యారు. అసలు అభిషేక్ శర్మకు సిగ్గు ఉందా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మ్యాచ్ లలో మత ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ? అంటూ నిలదీశారు. ఐసీసీ రూల్స్ ప్రకారం… ఇలా హిందూ మత ప్రచారం చేయడం నేరమే అంటూ ఆగ్రహించారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చేసుకోవాలి తప్ప.. ఐసీసీ మ్యాచ్ లలో కాదంటూ హితువు పలికారు. ఈ సంఘటనపై ఐసీసీ బాస్ జై షా వెంటనే రియాక్ట్ కావాలని డిమాండ్ చేశారు. అభిషేక్ శర్మ పై బ్యాన్ విధిస్తేనే ఇలాంటి సెలబ్రేషన్స్.. ఓవరాక్షన్ కు బ్రేకులు పడతాయని పేర్కొన్నారు ఇంజమామ్. దీంతో అభిషేక్ శర్మ సెలెబ్రేషన్స్ పై ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అభిషేక్ శర్మ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న ఇంజమామ్ కు అదే స్టైల్ లో ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అర్థ సెంచరీ లేదా సెంచరీ చేసినప్పుడు మైదానాలలో సెలబ్రేషన్స్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావ్ అంటూ నిలదీస్తున్నారు. మైదానంలో అల్లాకు పాకిస్తాన్ క్రికెటర్లు ప్రార్థనలు చేయడం ఎప్పుడూ చూడలేదా ? అభిషేక్ శర్మ ఒక్కడే తప్పు చేశాడని మాట్లాడడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. అన్ని మూసుకొని, ఇంట్లో కూర్చోవాలి అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Abhishek Sharma “Om Namah Shivay” celebration is going to give a meltdown to many. 😂
Loved it ❤️pic.twitter.com/tl5Rk4dLXN
— Abhinav Rajput (@Abhinavrt) September 17, 2026