E-Paper
Advertisement

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !
Advertisement

Abhishek Sharma Century: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఇవాళ చిట్టచివరి టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపటికి క్రితమే ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, దుమ్ము లేపుతోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ సెంచరీ తో ఇరగదీసాడు. 16 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్న అభిషేక్ శర్మ… 30 బంతులు ఎదుర్కొని సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.. దీంతో సోషల్ మీడియాలో అభిషేక్ శర్మ పేరు మారుమోగుతోంది.

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ శ‌ర్మ‌ రికార్డ్ బ‌ద్ద‌లు

టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 30 బంతుల్లో సెంచరీ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఇప్పటివరకు 11 సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు సాధించాడు. 317 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 108 పరుగుల వద్ద అభిషేక్ శర్మ, ఇన్నింగ్స్ ముగిసింది. అయితే 30 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 2017 డిసెంబర్ 22వ తేదీన ఇండోర్ వేదికగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 35 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ… ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇవాళ ఆ రికార్డును అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే బ్రేక్ చేశాడు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై విషం కక్కిన తన్వీర్ అహ్మద్

అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేయగానే సోషల్ మీడియా వేదికగా తన్వీర్ అహ్మద్ విషం కక్కాడు. అభిషేక్ శర్మ గుడ్డిగా బ్యాట్ ఊపుతాడని, షాకింగ్ ఆరోపణలు చేశారు. అతడి బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయని ఎప్పటినుంచో మొత్తుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఐసీసీ పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆఫ్గనిస్తాన్ లాంటి పసికూన జట్టుపై అభిషేక్ శర్మ 30 బంతులలోనే సెంచరీ పూర్తి చేశాడని చురకలు అంటించారు.

Advertisement

అటు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు కూడా స్లోగా బంతులు వేశారని మరో ఆరోపణ తెరపైకి తీసుకువచ్చారు. దమ్ముంటే పాకిస్తాన్ పై సెంచరీ చేసి చూపించాలని అభిషేక్ శర్మకు సవాల్ విసిరారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ ఇవ్వాల్టితో ముగియనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా… ఇవాళ కూడా గెలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 3-0 తేడాతో వైట్ వాష్ అవుతుందని అంటున్నారు.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Tags

Related News

ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

కొంపముంచిన స్మృతి వ్యవహారం.. పృథ్వీ షాతో కాబోయే భార్య బ్రేకప్

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

Big Stories

Advertisement
×