Tanveer Ahmed On Vaibhav: శ్రీలంక వేదికగా మొన్నటి వరకు జరిగిన ట్రై సిరీస్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) భాగంగా ఫైనల్స్ లో అదరగొట్టిన టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. దంబుల్లా (Rangiri Dambulla International Stadium, Dambulla) వేదికగా టీమిండియా వర్సెస్ శ్రీలంక లిస్ట్ A (Sri Lanka A vs India A, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించిన టీమిండియా… 66 పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ 94 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 8 సిక్సర్స్ అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. 300 స్ట్రైక్ రేట్ తో వైభవ్ దున్నిపడేశాడు. మొన్న గొడవ పెట్టుకున్నందుకు శ్రీలంక క్రికెటర్లకు.. చుక్కలు చూపించాడు వైభవ్. ఈ క్రమంలో వైభవ్ (Vaibhav Sooryavanshi ) ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ కాలర్లు పట్టుకుంటాడని.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసేటప్పుడు, శ్రీలంక బౌలర్లు బంతులు స్లోగా వేశారని బాంబు పేల్చారు. లేకపోతే వైభవ్ డకౌట్ అయ్యేవాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రై సిరీస్ ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. టైటిల్ గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 94 పరుగులతో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో కూడా 30 మీటర్ల బౌండరీ గేట్లు ఉన్నాయని.. అందుకే అవలీలగా వైభవ్ సూర్యవంశీ పరుగులు చేశాడని బాంబు పేల్చారు. సిక్సర్లు అలాగే బౌండరీలతో రెచ్చిపోయాడని ఆరోపణలు చేశారు. శ్రీలంక ప్లేయర్లతో మొన్న గొడవ పడ్డప్పుడు వాళ్ల కాలర్లు వైభవ్ పట్టుకున్నాడని గుర్తు చేశారు. అయితే మళ్లీ కాలర్లు పట్టుకుంటాడు అన్న భయంతో.. వైభవ్ సూర్య వంశీకి స్లోగా బంతులు వేశారని శ్రీలంక బౌలర్ల పరువు తీశాడు తన్వీర్ అహ్మద్. అటు బిసిసిఐ కూడా… శ్రీలంక బౌలర్లను భయపెట్టించిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోయి ఆడినట్లు వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తన్వీర్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. వీడికి ఇండియా పై ఏడవడం తప్ప.. మరో పని లేదంటూ మండి పడుతున్నారు.