E-Paper

అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు
Advertisement

Ashwin:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు వన్డేలు పూర్తికాగా, శనివారం చిత్త చివరి వన్డే జరగనుంది. అయితే ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జూన్ 17వ తేదీన లక్నో వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో వచ్చి 125 పరుగులు సాధించాడు. అది కూడా కేవలం 79 బంతుల్లో బాధడం హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లోకి ఇషాన్ కిషన్ ను (Ishan Kishan’) తీసుకోవాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. సునీల్ గవాస్కర్ కూడా ఇదే వాదన వినిపించారు. అయితే, సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలకు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కౌంటర్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పైన సెంచరీ చూసి, ఇషాన్ కిషన్ ను వన్డే వరల్డ్ కప్ లోకి తీసుకోవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సెంచరీ చేసినంత మాత్రాన… వరల్డ్ కప్ అవకాశం ఇస్తే, టీమిండియా ( Team India) కొంప మునుగుతుందని హెచ్చరించారు.

Also Read: Javed Miandad Vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. రవిచంద్రన్ అశ్విన్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ఒక్క సిరీస్ లేదా ఒక్క మ్యాచ్ లో రాణిస్తే, లేదా సెంచరీ చేస్తే వరల్డ్ కప్ కోసం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా.. వరుసగా రాణించే ప్లేయర్లను మాత్రమే వరల్డ్ కప్ కోసం తీసుకోవాలని సూచనలు చేశారు. ఈమధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ ను ఒక్క సెంచరీ చూసి, వరల్డ్ కప్ కోసం తీసుకుంటే పెద్ద తప్పు చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. అతని స్థానంలో అనుభవం ఉన్న ఆటగాన్ని మాత్రమే తీసుకోవాలని కోరారు. లేదా ఇప్పటినుంచి వన్డే వరల్డ్ కప్ వరకు ఇషాన్ కిషన్ రానిస్తే అప్పుడు ఆలోచించండి అని వ్యాఖ్యానించారు. కానీ ఒక్క సెంచరీ చూసి సెలెక్ట్ చేయడం తప్పన్నారు.

వరల్డ్ కప్ కోసం ఇషాన్ ను తీసుకోండి- సునీల్ గవాస్కర్

ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై సెంచరీ నమోదు చేసిన ఇషాన్ కిషన్ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం వీసా సిద్ధం చేసుకున్నాడని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. అతన్ని వరల్డ్ కప్ ఆడే టీం ఇండియా లోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అతడు వరల్డ్ కప్ లో బాగా రాణిస్తాడని పేర్కొన్నారు.

Advertisement

 

 

Also Read:  Kamran Akmal Slams Pakistan Womens Team : బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

 

 

Related News

గిల్లితే గిల్లించుకోవాలి కానీ, అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్

ఇషాన్‌ కిషన్‌కు వీసా వ‌చ్చేసింది…వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత‌డు త‌ప్పుకోవాల్సిందే !

ఫాతిమా సనాకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ‘ది హండ్రెడ్ 2026’ లోకి వైల్డ్‌కార్డ్

Tanveer Ahmed : నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

గిల్ పెద్ద సెల్ఫీష్‌..వాడి వల్లే డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయింది !

Big Stories

×