Kavya Maran On Abrar Ahmed: పాకిస్తాన్ మిస్టరీ విన్నర్ అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed) పరువు తీశారు కావ్య పాప (Kavya Maran). ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) కొనసాగుతున్న నేపథ్యంలో.. సన్రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) జట్టు తరఫున అబ్రార్ అహ్మద్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టోర్నమెంట్ ప్రారంభంలో అబ్రార్ అహ్మద్ ను తెగ మెచ్చుకున్న కావ్య, అతన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై అతడికి బౌలింగ్ ఇవ్వకూడదని కావ్య పాప సన్రైజర్స్ లీడ్స్ జట్టు కెప్టెన్ జాక్ క్రాలీకి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా కేవలం 5 బంతులు మాత్రమే ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది.
ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (The Hundred Men’s Competition 2026) భాగంగా నిన్న లీడ్స్ వేదికగా సన్రైజర్స్ లీడ్స్ వర్సెస్ లండన్ స్పిరిట్స్ (Sunrisers Leeds vs London Spirit) మధ్య 20వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ లీడ్స్ 37 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మిస్టరీ విన్నర్ అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed)కు కేవలం 5 బంతులు మాత్రమే ఇచ్చారు. పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, కావ్య పాప ఆదేశాల మేరకు అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. మిగిలిన 5 గురు బౌలర్లు తమ కోటాలో భాగంగా 20 బంతుల చొప్పున వేశారు. అబ్రార్ అహ్మద్ ఒక్కడినే వెలివేసి, బౌలింగ్ ఇవ్వలేదు. అయినప్పటికీ, సన్రైజర్స్ లీడ్స్ విజయం సాధించింది. అయితే అందరు ప్లేయర్లకు బౌలింగ్ ఇచ్చి తనకు ఇవ్వకపోవడంతో కావ్య పాప పై అసంతృప్తి వ్యక్తం చేశాడట పాకిస్తాన్ మిస్టరీ బౌలర్ అబ్రార్ అహ్మద్. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. తనకు బౌలింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడట.
పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం పై పాకిస్తాన్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావ్య పాప పై మండిపడుతున్నారు. అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసి ఇప్పుడు కావ్య పాప అవమానిస్తోందని ఆగ్రహం చేస్తున్నారు. కచ్చితంగా తమ బౌలర్ కు బౌలింగ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అటు ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం కావ్య పాపను ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. దేశద్రోహి అన్నవాళ్లే.. ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. శభాష్ కావ్య… పాకిస్తాన్ వాడిని పిలిచి, మరీ పరువు తీస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.