E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేట‌ర్ పైన ఉంది..అల్లా దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేట‌ర్ పైన ఉంది..అల్లా దిగివ‌చ్చినా కాపాడ‌లేడు
Advertisement

Mohammad Hafeez On Pak:  పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారయింది. ఏ క్షణంలో మ్యాచ్ గెలుస్తుందో? ఏ టైంలో ఓడిపోతుందో? ఎవరు ఎలా ఆడతారు ? ఎవరు విఫలమవుతారు ? ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా అధ్వానంగా తయారయింది. అయితే అలాంటి పాకిస్తాన్ క్రికెట్ జట్టును మరింత కుంగర్ తీసేలా మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉందని బాంబు పేల్చారు. ఏ క్షణమైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టైటానిక్ షిప్ తరహాలో కుప్పకూలడం గ్యారెంటీ అని హెచ్చరించారు. పరిస్థితులు మెరుగుపడకపోతే పాకిస్తాన్ క్రికెట్ ను కాపాడడం ఆ అల్లా వల్ల కూడా కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహమ్మద్ హఫీజ్.

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేట‌ర్ పైన ఉంది..అల్లా దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై తాజాగా మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉందని… అదృష్టం ఉంటేనే పాకిస్తాన్ గెలుస్తోందని హేళన చేస్తూ మాట్లాడారు. అదృష్టం కొద్ది గెలిచే మ్యాచ్ల పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడుస్తోందని.. అసలు జట్టులో స్థిరత్వం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో పాకిస్తాన్ అంటేనే టీమిండియా గజగజ వణికి పోయేదని గుర్తు చేశారు.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

కానీ ఇప్పుడు పసికూన బంగ్లాదేశ్ చేతిలో కూడా పాకిస్తాన్ తోక ముడుస్తోందని పరువు తీశారు. సొంత గడ్డపై జరిగే మ్యాచ్లలో కూడా పాకిస్తాన్ గెలవడం గగనం అయిపోయిందని తెలిపారు. ఒక సిరీస్ లో అద్భుతంగా ఆడడం… ఆ తర్వాత కుప్పకూలడం పాకిస్తాన్ క్రికెటర్లకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ఇలా స్థిరత్వం లేక పాకిస్తాన్ క్రికెట్ హస్తవ్యస్తం అవుతుందని విమర్శలు చేశారు. గాయాల బెడద కూడా పాకిస్తాన్ జట్టును దెబ్బతీస్తోందని వివరించారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ కారణంగా కూడా వైఫల్యం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి జట్టులో స్థిరత్వం పోయిందని మహమ్మద్ హఫీజ్ వెల్లడించారు. PSL టోర్నమెంట్ ను ఐపీఎల్ కంటే సక్సెస్ చేయాలన్న కసితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వెళుతోందని వెల్లడించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును బలోపేతం చేయడంలో PCB విఫలమవుతోందని.. దీర్ఘకాలిక వ్యూహాలు చేపట్టడం లేదని ఫైర్ అయ్యారు. తరచూ బాల్ టాంపరింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో కూడా పాకిస్తాన్ క్రికెటర్లు ఇరుక్కుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి దరిద్రుల వల్ల కూడా పాకిస్తాన్ జట్టు డిస్టర్బ్ అవుతోందని విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాజ‌కీయాలు మానేసి, పాకిస్తాన్ క్రికెట్ పై న‌ఖ్వీ దృష్టి సారించాల‌ని హెచ్చ‌రించారు హ‌ఫీజ్.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Related News

టీమిండియా క్రికెటర్ల మెడ‌పై మోడీ స‌ర్కార్‌ క‌త్తి పెడుతోంది !

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

పాకిస్తాన్‌ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే బాగుండు

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

Big Stories

Advertisement
×