Tanveer Ahmed: టీ20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan women’s team) అత్యంత చెత్త ప్రదర్శన కన బరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా చేతిలో మొదటగా ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల జట్టు, లేటెస్ట్ గా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది పాకిస్తాన్. అంటే ఈ లెక్కన టీ20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టులో ముగ్గురు మినహా ఏ ఒక్కరు సరిగ్గా ఆడడం లేదని సీరియస్ అయ్యారు. అటు వహాబ్ రియాజ్ కు (Wahab Riaz) కోచింగ్ చేతకావడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ జట్టును మంచి ట్రాక్ లో పెట్టడం చేత కాకపోతే, రాజీనామా చేసి తప్పుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు విఫలమవుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచల వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముగ్గురు ప్లేయర్లు మినహా ఎవరు కూడా సరిగ్గా ఆడడం లేదని సీరియస్ అయ్యారు. కెప్టెన్ ఫాతిమా సనా, మునీబా అలీ, సౌదీయా ఇక్బాల్ ముగ్గురు మినహా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఏ ఒక్కరు మెరుగైన ప్రదర్శన కనబరచడం లేదని మండిపడ్డారు. ఇక మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫాతిమా సనా ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన ప్లేయర్లు సహకరించలేదని ఆగ్రహించారు.
ప్లేయర్ల విషయం పక్కకు పడితే… వహాబ్ రియాజ్ (Wahab Riaz) పెద్ద హీరోలా బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్ లో మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతనిపై ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి వాడిని కోచ్ గా పెట్టుకోవడం దండగ అన్నారు. కోచింగ్ పదవి చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని వహాబ్ రియాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. తనకు అవకాశం ఇస్తే… పాకిస్తాన్ మహిళల జట్టును అద్భుతంగా తయారు చేస్తానని చాలెంజ్ విసిరారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.